మీకు తెలియకుండానే మీ శక్తిని నాశనం చేస్తున్న అలవాట్లు ఇవే..

by Sujitha Rachapalli |

ఎప్పుడు అలసిపోయినట్లుగా అనిపిస్తుందా? మోటివేషన్‌తో ముందుకు సాగలేకపోతున్నారా? మీలో ఉత్సాహం అస్సలే లేదని అనిపిస్తోందా? అయితే మీలో ఈ అలవాట్లు ఉన్నాయేమో చూసుకోండి. మీలో శక్తి సన్నగిల్లేందుకు కారణం ఇవే కావొచ్చు.

మీకు తెలియకుండానే మీ శక్తిని నాశనం చేస్తున్న అలవాట్లు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : ఎప్పుడు అలసిపోయినట్లుగా అనిపిస్తుందా? మోటివేషన్‌తో ముందుకు సాగలేకపోతున్నారా? మీలో ఉత్సాహం అస్సలే లేదని అనిపిస్తోందా? అయితే మీలో ఈ అలవాట్లు ఉన్నాయేమో చూసుకోండి. మీలో శక్తి సన్నగిల్లేందుకు కారణం ఇవే కావొచ్చు. మీ ఎనర్జీ ఎలా డ్రెయిన్ అవుతుందో చూద్దాం.

బ్రేక్స్ లేకుండా ఓవర్ వర్క్

విరామం తీసుకోకుండా అధికంగా పనిచేయడం అలసటకు దారితీస్తుంది. ఒక వ్యక్తి భోజనం తర్వాత పనిచేసినా.. మొదట్లో ప్రొడక్టివిటీ తక్కువగా అనిపించవచ్చు. కానీ చివరికి అలసిపోయి, సామర్థ్యం తగ్గిపోతుంది. ఉత్పాదకతను మెరుగుపరచడానికి, శక్తిని పెంచడానికి క్రమం తప్పకుండా విరామం తీసుకోండి.

గత బాధలు

గతంలో జరిగిన గొడవలు, బాధలు అంటిపెట్టుకుని ఉండటం వల్ల మనసులో భారం పెరుగుతుంది. జరిగిన వాదనను తరచుగా గుర్తుచేసుకుంటూ.. ఆగ్రహంతో కుంగిపోవడం వల్ల ప్రస్తుత సంబంధాలను ఆస్వాదించడం కష్టంగా అనిపించవచ్చు. పాస్ట్‌ను వదిలించుకోవడానికి ట్రై చేయండి. ప్రజెంట్‌పై కాన్సంట్రేట్ చేయండి.

ఫోన్ చెకింగ్

ఇమెయిల్స్, సోషల్ మీడియాను చెక్ చేయడంతో తరచుగా అంతరాయాలు ఏర్పడటం వల్ల మీరు ఫోకస్ చేయడంలో ఇబ్బంది పడుతారు. ఉదాహరణకు ప్రతి కొన్ని నిమిషాలకు ఒకసారి తమ ఫోన్‌ను తనిఖీ చేసుకునే ఒక ప్రొఫెషనల్.. వారి వర్క్ ఫ్లోకు అడ్డుపడటం వలన ఒత్తిడి పెరుగుతుంది. డిస్ట్రాక్షన్స్ తగ్గించడానికి ఇమెయిల్‌లు, సోషల్ మీడియాను చెక్ చేసుకునేందుకు టైమ్ సెట్ చేసుకోండి.

టూ మచ్ స్లీప్

​అతిగా నిద్రపోవడం వల్ల ఫ్రెష్‌గా ఉండలేరు. ఈ అలవాటు మీ శక్తిని హరించివేస్తుంది. బద్ధకానికి దారితీస్తుంది. ఉదాహరణకు రాత్రి పది గంటలు నిద్రపోయే వ్యక్తి ఏడు నుండి ఎనిమిది గంటలు స్థిరంగా నిద్రపోయిన దానికంటే ఎక్కువ అలసిపోయినట్లు అనిపించవచ్చు. దీన్ని పరిష్కరించడానికి సరైన విశ్రాంతి కోసం 7-8 గంటల స్థిరమైన స్లీప్ షెడ్యూల్‌ను సెట్ చేయండి.

Next Story