- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాత్రి బెడ్ మీద చేసే అలాంటి పని మీ భాగస్వామికి నచ్చపోవచ్చు.. జాగ్రత్త.. ఘోరాలు జరిగిపోగలవు..

దిశ, ఫీచర్స్ : ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఈ మధ్య కొన్ని వివాహ బంధాలు అటకెక్కుతున్నాయి. ఇందుకు కారణం సర్దుకుపోలేక పోవడమే. ప్రేమలో ఉన్నప్పుడు కేవలం ఓ గంట లేదా రెండు గంటలు కలిసి తిరిగిన ఇద్దరు.. విడివిడిగా తమకు నచ్చినట్లుగా బతికేస్తారు. కానీ ఒక్కటయ్యాక 24గంటలు కలిసి ఉండలేకపోతారు. ప్యూర్ లవ్ ఉన్న కొందరు అర్థం చేసుకుని మసులుకుంటే.. స్వేచ్ఛ కోరుకున్న ఇంకొందరు విడిపోక తప్పట్లేదు. ముఖ్యంగా బెడ్ టైమ్‌లో చేసే ఈ పనులు విడాకులు తీసుకునేందుకు కారణమవుతున్నాయి.
డిఫరెంట్ షెడ్యూల్స్
భార్యాభర్తల్లో ఎర్లీగా పడుకుంటే.. ఇంకొకరు లేట్ నైట్స్ వరకు మెళకువతోనే ఉంటారు. ఇది ఇలాగే కొనసాగితే ఒకరి వల్ల మరొకరు డిస్టర్బ్ అవుతారు. దీనివల్ల క్లాషెస్ రావచ్చు. ఈ ఇంపాక్ట్ ప్రతి విషయంలోనూ ఉండొచ్చు. కాబట్టి నిద్రవేళలు సెట్ చేసుకుంటే.. ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఎలాంటి సమస్యలు తలెత్తవు.
సెపరేట్‌గా పడుకోవడం
గురక, పిల్లలను పడుకోబెట్టేందుకు.. చాలా మంది భార్యాభర్తలు సెపరేట్‌గా పడుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఫిజికల్ క్లోజ్‌నెస్, ఇంటిమేట్ కన్వర్జేషన్స్ తగ్గిపోతున్నాయి. అయితే కొందరు ఈ దూరాన్ని తగ్గించుకునేందుకు ట్రై చేస్తారు. కానీ ఇంకొందరికి సాధ్యం కాకపోవడంతో.. డిస్టేన్స్ పెరుగుతూనే ఉంది. ఇదే కొన్నేళ్లు కొనసాగి విడిపోయే పరిస్థితి వస్తుంది.
ఫిజికల్ అఫెక్షన్
హెల్తీ రిలేషన్‌షిప్‌లో గుడ్ నైట్ చెప్తూ హగ్, కిస్ ఇచ్చుకోవడం ఫిజికల్ అఫెక్షన్ స్పార్క్‌ను అలాగే ఉంచుతుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు డిస్‌కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. నమ్మకం కోల్పోవడానికి దారితీస్తుంది. భాగస్వామి ఉన్నా లేకున్నా ఒక్కటే అనే ఆలోచన వచ్చేస్తుంది. ఇది విడాకులకు కారణమవుతుంది.
శుభ్రత లేకపోవడం
చాలా మంది భాగస్వాములు ఎదుర్కొనే సమస్య ఫిజికల్ హైజీన్. భార్యాభర్తల్లో ఒక్కరు చాలా నీట్‌గా మెయింటెన్ చేస్తే ఇంకొకరు అసలు శుభ్రంగా ఉండరు. దీనివల్ల చిరాకు పెరుగుతుంది. ఫిజికల్ క్లోజ్‌నెస్ తగ్గుతుంది. కాబట్టి అట్రాక్షన్ అలాగే ఉండాలంటే.. శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే.. పార్ట్‌నర్‌కు నచ్చినట్లుగా పరిశుభ్రంగా ఉండటం మంచిది. లేదంటే ఈ చిరాకు డైవోర్స్‌కు దారితీయొచ్చు.