- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్యానికి మేలు చేసే అతి ముఖ్యమైన డ్రై ఫ్రూట్స్ ఇవే..
చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని ఆహార నిపుణులు చెప్తున్నారు.

దిశ, ఫీచర్స్ : చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని ఆహార నిపుణులు చెప్తున్నారు. బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, వాల్‌నట్స్, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచి, శీతాకాలంలో తరచుగా వచ్చే ఇన్‌ఫెక్షన్స్‌తో పోరాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడేలా చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో డ్రై ఫ్రూట్స్ చేర్చడం మంచిదంటున్న నిపుణులు.. వాటి ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు.
* ఎండుద్రాక్ష
ఇందులో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలుంటాయి. జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఫైబర్ కలిగి ఉన్నందున హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష నేచురల్‌గానే తియ్యగా ఉంటుంది కాబట్టి కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఐరన్, కాల్షియం, బోరాన్ తగిన మోతాదులో ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఐరన్ కూడా రెడ్ బ్లడ్ సెల్స్ పెరిగేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ఉన్నందువల్ల క్యాన్సర్, గుండె జబ్బులు రావు.
వీటిని ఇష్టపడనివారు దాదాపు ఉండరు. వీటిలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం పోషకాలు లభిస్తాయి. వీటిలో ఉండే పాలీఫెనాల్స్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి. జీర్ణక్రియకు దోహదం చేస్తాయి.
వీటిలో పొటాషియం, ఆరోగ్యకరమైన కొవ్వు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. వీటిలోని అధిక ప్రోటీన్, ఫైబర్ మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. సోడియం కూడా ఉంటుంది కాబట్టి కాస్త మితంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు.
* జీడిపప్పు
ఇది కూడా ఇతర గింజల మాదిరిగానే పోషక విలువలతో నిండి ఉంటుంది. మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. మెదడు పనితీరును, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా కలిగి ఉండి.. గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచడానికి, హై బీపీని తగ్గించడంలో కీలకంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. అయితే పచ్చి జీడిపప్పులో ఉప్పు, నూనె ఎక్కువగా ఉంటాయని, వాటిని వేయించి తినడంవల్ల తగ్గుతుందని ఆహార నిపుణులు చెప్తుంటారు.
* బాదం
జ్ఞాపకశక్తిని పెంచడంలో బాదం అద్భుతంగా సహాయపడుతుంది. రాత్రంతా నానబెట్టిన తర్వాత ఉదయం తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని డైటీషియన్లు చెప్తుంటారు. విటమిన్ ఈ పుష్కలంగా ఉన్న వీటిని తినడంవల్ల వృద్ధుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందట. బాదం పప్పులో సమృద్ధిగా ఉన్న మెగ్నీషియం రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్ కూడా ఉంటాయి. పావు కప్పు బాదంలో 162 కేలరీలు ఉంటుంది.






