- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Worlds Most Expensive Pigeon: వామ్మో.. ఈ పావురం ధర 100BMW కార్లకు సమానం.. అత్యంత ఖరీదు బాసూ!
Worlds Most Expensive Pigeon: మనం చాలా రకాల పక్షులను చూస్తుంటాం. అందులో కొన్ని ఇంట్లో పెంచుకుంటుంటాం.

దిశ,వెబ్‌డెస్క్: Worlds Most Expensive Pigeon: మనం చాలా రకాల పక్షులను చూస్తుంటాం. అందులో కొన్ని ఇంట్లో పెంచుకుంటుంటాం. వాటి ధర వందల్లో, వేలల్లో ఉంటుంది. కానీ కోట్లలో ధర పలికే పక్షి ఏదో మీకు తెలుసా. అసలు ఎందుకు ఆ పక్షి అంత ధర పలుకుతోంది..దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
ప్రపంచంలో చాలా ఖరీదైన వస్తువుల గురించి మనం తరుచుగా మాట్లాడుతుంటాం. వాటి ధరలు లక్షల్లో ఉంటాయి. కానీ ఎప్పుడైనా అత్యంత ఖరీదైనా పావురం గురించి విన్నారా? ఆ పావురం ధర ఒకటి కాదు రెండు కాదు 100 BMW బీఎండబ్ల్యూ కార్లకు సమానం అట. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పక్షిగా పరిగణించబడుతోంది. పావురాలు మత్రమే కాదు..కొన్ని చిలుకలు, కోళ్లు కూడా చాలా ఖరీదైనవి ఉన్నాయట. వాటి స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.
అత్యంత ఖరీదైన పావురం ధర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పక్షి రేసింగ్ పావురం. ఇది 2020లో అర్మాండో అనే రేసింగ్ పావురం 1.4మిలియన్ డాలర్లకు అంటే దాదాపు 115కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. ఈ పావురం ఛాంపియన్ రేసర్. ఇది చాలా వేగంగా ప్రయాణిస్తుంది. వాటికి ఎక్కువ దూరం ఎగరడానికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ పావురాలు గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంటాయి. అర్మాండో అత్యంత ఖీరదైన పక్షిగా ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రస్తుతం బీఎండబ్ల్యూ ఎక్స్ 4 ధర రూ. 96.24లక్షలు. అంటే సుమారు కోటి రూపాయలు. ఈ లెక్కన చూసినట్లయితే అర్మాండో పావురం ధర 100 కంటే ఎక్కువ కార్లకు సమానం అని చెప్పవచ్చు.
అత్యంత ఖరీదైన చిలుక
న్యూ గినియాలో బ్లాక్ పామ్ కాకటూ అనే పెద్ద చిలుక ఉంటుంది. ఈ చిలుక ఈకలు నల్లగా, ముక్కు పెద్దగా ఉంటుంది. బ్లాక్ పామ్ కాకటూ ధర 15వేల డాలర్లు. 12లక్షల వరకు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చిలుక హైసింత్ మకావ్, ఇది దక్షిన అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మూడు అడుగు పొడవు పెరుగుతుంది. దీని ధర 10,000 డాలర్లు అంటే దాదాపు 8లక్షల రూపాయలు.
నల్ల మాంసం కోళ్ళు
ఆయం సెమాని చికెన్ అనేది ఒక అరుదైన జాతి కోడి. ఇంది ఇండోనేషియాలో ఎక్కువగా కనిపిస్తుంది. దాని నల్ల ఈకలు, నల్ల చర్మం, నల్ల మాంసం చాలా ప్రసిద్ధి. ఈ కోళ్లు చాలా ఖరీదు. వీటి ధర 2,500 డాలర్లు అంటే 2లక్షల రూపాయల వరకు ఉంటుంది.






