ప్రైవసీ ఇప్పుడు ఆటోమేటిక్.. సోషల్ మీడియా నుంచి స్మార్ట్ డివైస్‌ల వరకు..!!

by Javid Pasha |

ప్రైవసీ ఇప్పుడు పూర్తిగా అంతర్ధానం కాలేదు. కానీ ఆటోమేటిక్‌గా మారిపోయింది. మనం స్మార్ట్‌ఫోన్‌లలో స్క్రోల్ చేస్తూ, స్వైప్ చేస్తూ, స్మార్ట్ డివైస్‌లతో మాట్లాడుతుండగా, టెక్నాలజీ మన గురించి మనకు తెలియకుండానే ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తోంది.

ప్రైవసీ ఇప్పుడు ఆటోమేటిక్.. సోషల్ మీడియా నుంచి స్మార్ట్ డివైస్‌ల వరకు..!!
X

దిశ, ఫీచర్స్ : వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత వంటివి వ్యక్తుల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. తమ వ్యక్తిగత జీవితం, అభిప్రాయాలు, కుటుంబ వ్యవహారాలు, అలవాట్లు వంటి విషయాల్లో చాలా మంది సరిహద్దులు పాటించేవారు. కొన్ని విషయాలను బయటకు చెప్పకపోయేవారు. కానీ ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం, ముఖ్యంగా సోషల్ మీడియా ఎంట్రీతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారడంతో ప్రైవసీలోనూ సడలింపులు స్టార్ట్ అయ్యాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేదా ఆన్లైన్ వేదికల వినియోగదారుల్లో చాలా తక్కువ మంది మాత్రమే చాలా వ్యక్తిగతమైన విషయాల్లో తప్ప అన్నింటిలోనూ గోప్యతను పాటించాలని ఏమీ అనుకోవడం లేదు. ఇక ఆధునిక యువతలో అయితే అరుదైన కొన్ని అంశాల్లో తప్ప చాలా విషయాల్లో ప్రైవసీ పట్టింపులు లేని ధోరణి పెరుగుతోంది.

మనకు తెలియకుండానే..

ప్రైవసీ ఇప్పుడు పూర్తిగా అంతర్ధానం కాలేదు. కానీ ఆటోమేటిక్‌గా మారిపోయింది. మనం స్మార్ట్‌ఫోన్‌లలో స్క్రోల్ చేస్తూ, స్వైప్ చేస్తూ, స్మార్ట్ డివైస్‌లతో మాట్లాడుతుండగా, టెక్నాలజీ మన గురించి మనకు తెలియకుండానే ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రస్తుతం ఇది యాక్టివ్‌గా ఉందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి ట్రాకింగ్ కొన్ని సార్లు డిస్టోపియన్ నవలలాగా అనిపిస్తుంది. రోజువారీ జీవితంలో మనల్ని ట్రాక్ చేసే 10 నిజమైన మార్గాలు ఉన్నాయి. ఇవి సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్‌లు, ఈమెయిల్‌లు, యాప్‌లు, కుకీలు, మొబైల్ డివైస్‌లు, వై-ఫై, సర్వైలెన్స్ కెమెరాలు, ఆన్‌లైన్ షాపింగ్, హోమ్ డివైస్‌లు వంటివి.

సెర్చ్ ఇంజిన్ల కీ రోల్

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల విషయానికి ఫేస్‌బుక్ సహా పలు ఇతర వేదికలు కూడా మన రాజకీయ ఆలోచనలు, వయసు, స్నేహితుల స్థానాలు(Locations of friends), ఉపయోగిస్తున్న డివైస్‌లు వంటి సమాచారాన్ని ట్రాక్ చేసి, వ్యక్తిగతీకరించిన (Personalized)యాడ్‌లు చూపిస్తాయి. సెర్చ్ రిజల్ట్‌లలో గూగుల్ వంటి ఇంజిన్‌లు మన సెర్చ్ క్వెరీలు, క్లిక్ చేసిన యాడ్‌లు, వీడియోలు, ఇమేజ్‌లు, లింక్‌లను స్టోర్ చేస్తాయి. అయితే అన్నీ ట్రాక్ చేస్తాయని కాదిక్కడ. సోషల్ మీడియా వేదికల్లో ప్రైవసీ ఉంటుందని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదనే విషయాన్ని గుర్తించాలి. ఈమెయిల్‌లలో థర్డ్-పార్టీ కంపెనీలు/యాప్‌లు అంతర్లీనంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఎప్పుడు ఏం క్లిక్ చేశాం. ఏం ఓపెన్ చేశాం. ఏ డివైస్ ఉపయోగించాం విషయాలను మన స్థానాన్ని ట్రాక్ చేస్తాయి. యెల్ప్, టిండర్, స్నాప్‌చాట్ వంటివి యాప్‌లు ఇందుకు చక్కటి ఉదాహరణ. ఇవి లొకేషన్ యాక్సెస్ అడిగినప్పుడు ఏం అవుతుందిలే అని అందరూ యాక్సెస్ చేస్తుంటారు. కానీ అవి మనం ఎక్కడున్నామో తెలుసుకుంటాయి. కుకీలు సైట్‌లు మన మునుపటి విజిట్‌లు, ప్రాధాన్యతలు గుర్తుంచుకుని యాడ్‌లు టార్గెట్ చేస్తాయి. అయితే బ్రౌజర్‌లలో వీటిని డిసేబుల్ చేయవచ్చు కూడా.

హ్యాకర్లు యాక్సెస్ చేయొచ్చు

మొబైల్ డివైస్‌లు సెన్సార్‌ల ద్వారా ఫిజికల్ ఉపయోగాలు(Physical use), లైట్, టెంపరేచర్ వంటి పర్యావరణ కారకాలు, కాల్ రికార్డులు, GPS ద్వారా లొకేషన్‌ను ట్రాక్ చేయడం వంటివి చేస్తాయి. పబ్లిక్ వై-ఫైలు అన్‌సెక్యూర్డ్‌గా ఉంటే హ్యాకర్లు మన డివైస్‌లను యాక్సెస్ చేసి సోషల్ సెక్యూరిటీ, క్రెడిట్ కార్డ్ వివరాలు తీసుకోవచ్చు. సర్వైలెన్స్ కెమెరాలు ప్రపంచవ్యాప్తంగా 245 మిలియన్లు ఇన్‌స్టాల్ అయి మానిటరింగ్ చేస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ మన షాపింగ్ హ్యాబిట్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని రివీల్ చేసి టార్గెటెడ్ యాడ్‌లను ఆన్‌లైన్ వేదికల్లో ప్రదర్శిస్తుంది. హోమ్ డివైస్‌లు గూగుల్ హోమ్, అలెక్సా వంటివి క్వెరీలు, సంభాషణలను రికార్డ్ చేస్తాయి. వీటిని యాక్సెస్ చేసి డిలీట్ చేయవచ్చు. డిలీట్ చేయకుంటే ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తలెత్తవచ్చు. మొత్తానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో ప్రైవసీ గురించి పెద్దగా పట్టింపులు లేకపోవడం, నార్మలైజ్ అనుకోవడం వంటి అభిప్రాయంతో ఉన్నవారికి సమస్య ఏం లేదు. ప్రతీ విషయాన్ని గోప్యతగా భావించేవారికి మాత్రం స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వేదికలు కూడా భద్రతను కల్పించలేవమో!! Link

Next Story