- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతీ అనారోగ్యానికి మెడిసిన్ అవసరం లేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు!
కొందరు ప్రతీ చిన్న అనారోగ్యానికి ఆందోళన చెందుతుంటారు. మెడిసిన్ వాడేస్తుంటారు. కానీ అలాంటి అవసరం లేకుండానే కొన్ని సింపుల్ ట్రిక్స్‌తో ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు.

దిశ, ఫీచర్స్ : రోజువారీ జీవితంలో మనం అనేక మానసిక, శారీరక అనారోగ్యాలను సైతం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే కొందరు ప్రతీ చిన్న విషయానికి ఆందోళన చెందుతుంటారు. డాక్టర్లను సంప్రదించడం ద్వారానో, మెడికల్ షాపుల నుంచో మెడిసిన్ తెచ్చుకొని వాడేస్తుంటారు. దీంతో ఖర్చులు పెరిగిపోతుంటాయి. కానీ అలాంటి అవసరమేమీ లేందంటున్నారు ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు. వ్యక్తులుగా సొంతంగా తీసుకోగలిగే కొన్ని జాగ్రత్తలు, పాటించగలిగే ట్రిక్స్ అనేక అనారోగ్యాలను దూరం చేస్తాయని చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
*అధిక ఆందోళన లేదా నిద్ర రాకపోతే (High Anxiety / Can't Sleep): ఫిజియోలాజికల్ సై(Physiological Sigh) ట్రై చేయండి. అంటూ ముక్కుతో లోతుగా రెండుసార్లు ఇన్‌హేల్స్ అంటే మొదట ఒక డీప్ బ్రీత్, తర్వాత మరో చిన్న బ్రీత్ తీసుకోండి. ప్రతిరోజూ నిద్రకుముందు ఇలా చేయడంవల్ల 30-60 సెకన్లలో హార్ట్ రేట్ తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తుందని, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయని, నిద్ర బాగా పడుతుందని స్టాన్‌ఫర్డ్ అధ్యయనాల్లో నిరూపితమైంది.
*శక్తి హీనంగా అనిపించడం : (Low energy / Feeling lazy): చల్లటి నీటితో ముఖం కడుక్కోండి లేదా ఐస్ వాటర్‌లో మీ ముఖాన్ని 15 నుంచి 30 సెకన్లు ముంచి బయటకు తీయండి. ఇది వేగస్ నరాలను ఉత్తేజ పరిచి, తక్షణ శక్తిని అందిస్తుంది. అలర్ట్‌నెస్‌ను పెంచుతుంది.
*ముక్కు దిబ్బడం(Stuffy nose) : నోటి పైభాగాన ఐస్ క్యూబ్‌ను అదిమి పట్టండి (Press an ice cube to the roof of your mouth). ఇది ముక్కు లోపలి రక్తనాళాలను సంకోచింపజేసి, బ్లాక్‌ను క్లియర్ చేస్తుంది. తక్షణ రిలీఫ్ వస్తుంది. శ్వాస తీసుకోవడం సులభమవుతుంది. ఇది సాధారణ జలుబు లేదా అలర్జీ సమయంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
*నరాలు తెగిపోతున్నట్టు అనిపించినప్పుడు (Nerves): ముక్కును మెల్లగా పించ్ చేయండి (Pinch your nose to column down). అంటే ముక్కు చిదిమినట్లు చేయాలి. ఇది వాగస్ నరాలను యాక్టివేట్ చేసి, శరీరంలోని నరాలను శాంతపరుస్తుంది. దీంతో మీరు తక్షణమే రిలాక్స్ అవుతారు. టెన్షన్ లేదా స్ట్రెస్ సమయంలో ఈ సింపుల్ ట్రిక్ ప్రయత్నిస్తే సమస్య తగ్గడంతోపాటు మీలో ఉత్సాహం పెరుగుతుంది.
*సోమరితనం (Feeling lazy) : మీరు బద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే బ్రష్ చేసేటప్పుడు మీ ఎడమ చేత్తో దంతాలు తోముకోండి. ఈ పరిస్థితి మీ మెదడును ఉత్తేజపరిచి, కొత్త న్యూరల్ కనెక్షన్లను సృష్టిస్తుంది. సోమరితనం తగ్గి, మీరు మరింత యాక్టివ్‌గా మారతారు. మీ రోజువారీ అలవాట్లలో ఇలాంటివి ప్రయత్నించడం అనేక అనారోగ్యాలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






