- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Technology : విశ్వ రహస్యాల ఛేదనలో టెక్నాలజీ.. మానవాళి చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఆవిష్కరణలివే..
అంతరిక్షంలో నిర్మితమైన అతి పెద్ద నిర్మాణం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతూ.. పరిశోధనలకు ప్రయోగశాలగా ఉన్నది.

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉందనుకునేవారు. కానీ ఆ తర్వాత అది గోళాకారంలో గుండ్రంగా ఉందని ఆధునిక సాంకేతికత ఆధారంగా సైన్స్ నిరూపించింది. ఒకప్పుడు భూమి నుంచి చూస్తున్నప్పుడు ఆకాశంలో కనిపించే చంద్రుడు దేవుడు అనుకునేవారు.. కానీ ఆ తర్వాత అదొక భూమి లాంటి గ్రహమని సైన్స్ నిరూపించింది. ఇలా ఒకటీ రెండు కాదు. ఎన్నో విశ్వ రహస్యాలను ఛేదించడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కీ రోల్ పోషించాయి. శాస్త్రీయ అన్వేషణ నుంచి రక్షణ, రవాణా, ఆధునిక జీవనశైలి వరకు వివిధ ప్రయోజనాలకోసం పలు సాంకేతికలను మానవాళి సృష్టించుకోగలిగింది. అలాంటి వాటిలో లార్జ్ హాడ్రాన్ కొలైడర్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, బాగర్ 288 ఎక్స్‌కవేటర్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, పామ్ ఐలాండ్స్, అంటోనోవ్ ఎఎన్-225 “మ్రియా” వంటి నిర్మాణాలు మానవ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాయి.
లార్జ్ హాడ్రాన్ కొలైడర్
స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ సరిహద్దులో గల భూగర్భంలో 27 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న అతి పెద్ద సాంకేతిక ఆవిష్కరణ లార్జ్ హాడ్రాన్ కొలైడర్. అంతేకాదు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సైంటిఫిక్ మెషిన్. ఇది సూక్ష్మ కణాలను దాదాపు కాంతి వేగంతో ఢీకొనిపిస్తూ (Colliding) విశ్వ సృష్టి (Universal product), పదార్థ నిర్మాణం వంటి రహస్యాలను చేధిస్తుంది. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (Cern) నిర్వహణలో ఉన్న ఈ మెషిన్ హిగ్స్ బోసాన్ కణం (Higgs boson particle) ఆవిష్కరణకు దోహదపడింది. దీని నిర్మాణం శాస్త్రీయ అన్వేషణలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచి, భౌతిక శాస్త్రంలో సరికొత్త మార్గాలను తెరిచింది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్
అంతరిక్షంలో నిర్మితమైన అతి పెద్ద నిర్మాణం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, దీని నిర్మాణ వ్యయమే 150 బిలియన్ డాలర్లకు పైగా. భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతూ.. ఇది అంతరిక్ష పరిశోధనలకు ప్రయోగశాలగా పనిచేస్తున్నది. అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడా సహకారంతో నిర్మితమైన ఐఎస్‌ఎస్, గురుత్వాకర్షణ లేని వాతావరణంలో జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, వైద్య పరిశోధనలను సాధ్యం చేస్తుంది. అంతరిక్ష యాత్రలకు మార్గం సుగమం చేసే ఈ స్టేషన్, మానవ జాతి భవిష్యత్ అంతరిక్ష అన్వేషణలకు బాటలు వేస్తోంది.
బాగర్ 288 ఎక్స్‌కవేటర్
జర్మనీలోని బాగర్ 288 ఎక్స్‌కవేటర్ 13,500 టన్నుల బరువుతో ప్రపంచంలోనే తవ్వకాలు చేసే అతిపెద్ద యంత్రంగా (As an excavator) గుర్తింపు పొందింది. 1978లో నిర్మితమైన ఈ భారీ మెషిన్ రోజుకు 2,40,000 టన్నుల బొగ్గును తవ్వగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది ఒక ఫుట్‌బాల్ మైదానాన్ని 30 మీటర్ల లోతుకు తవ్వగల స్థాయిగా పరిశోధకులు చెప్తారు. అంటే గనుల తవ్వకం, భారీ నిర్మాణ ప్రాజెక్టులలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీని భారీ పరిమాణం, సామర్థ్యం పారిశ్రామిక విప్లవంలో ఇంజనీరింగ్ పరాక్రమాన్ని ప్రదర్శిస్తాయి.
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
చైనాలోని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 21,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి, పురాతన కాలంలో రక్షణ కోసం నిర్మితమైన అతిపెద్ద గోడగా చరిత్రలో స్థానం సంపాదించింది. క్రీ.పూ. 221 నుంచి 1644 వరకు వివిధ రాజవంశాలు దీనిని నిర్మించాయి. శత్రువుల దాడుల నుంచి రక్షణ కల్పించడం, సరిహద్దు నియంత్రణ, వాణిజ్య మార్గాల పరిరక్షణ కోసం దీనిని నిర్మించారు. రాయి, ఇటుక, చెక్కతో నిర్మితమైన ఈ గోడ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నది.
పామ్ ఐలాండ్స్
దుబాయ్‌లోని పామ్ ఐలాండ్స్, మిలియన్ల క్యూబిక్ మీటర్ల ఇసుక, రాయితో సముద్రంలో నిర్మితమైన కృత్రిమ దీవులు(Artificial islands), ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలుస్తాయి. పామ్ జుమేరా, పామ్ జెబెల్ అలీ, దీరా ఐలాండ్‌లుగా మూడు భాగాలుగా నిర్మితమైన ఈ దీవులు ఆతిథ్య(Hospitality), రియల్ ఎస్టేట్, వినోద పరిశ్రమలకు కేంద్రంగా మారాయి. 2001లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు దుబాయ్‌ను గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చింది. ఈ దీవులపై లగ్జరీ హోటళ్లు, రెసిడెన్షియల్ విల్లాస్, వినోద కేంద్రాలు నిర్మితమయ్యాయి. ఇదంతా ఆధునిక సాంకేతికత ద్వారానే సాధ్యమైంది.
అంటోనోవ్ ఎఎన్-225 ‘మ్రియా’
ఉక్రెయిన్‌కు చెందిన అంటోనోవ్ ఎఎన్-225 “మ్రియా” 640 టన్నుల గరిష్ఠ బరువుతో ప్రపంచంలోనే అతి భారీ విమానంగా రికార్డు సృష్టించింది. 1988లో తొలిసారి ఎగిరిన ఈ విమానం 250 టన్నుల బరువును మోసే సామర్థ్యం కలిగి ఉంది. అంతరిక్ష షటిల్‌లు, భారీ యంత్రాలు, సైనిక సామగ్రి వంటి అతిపెద్ద లోడ్ కలిగిన రవాణాకు ఇది ఉపయోగపడింది. దీని ఆరు ఇంజన్లు, 84 మీటర్ల పొడవు ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఈ విమానం అంతరిక్ష పరిశోధన, విపత్తు సహాయక చర్యలలో కీలక పాత్ర పోషించింది.






