మామా.. బూడిద గుమ్మడితో బూస్టింగ్

by Daayi Srishailam |

గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటారెందుకూ.?

మామా.. బూడిద గుమ్మడితో బూస్టింగ్
X

దిశ, ఫీచర్స్

గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటారెందుకూ అనే సామెతను మనం విరివిగా వాడుతుంటాం. అంటే గుమ్మడికాయకు అంత విశిష్టత ఉంటదన్నమాట. గుమ్మడి రకాల్లో బూడిద గుమ్మడికాయకు భలే గిరాకీ ఉంటుంది. దిష్టి నివారిణిగా దీనిని మార్కెట్లో అమ్ముతుంటారు. అయితే బూడిద గుమ్మడికాయ దిష్టికే కాదు.. దానిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. రోగనిరోధక శక్తిని పెంచే గుణం దీనికుంటుందట. దానిని జ్యూస్ రూపంలో తీసుకుంటే ఇంకా మెండైన లాభాలుంటాయంటున్నారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు. మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. బాడీ డీహైడ్రేట్ సమస్యకూ ఇది చక్కటి పరిష్కారంగా చెప్తుంటారు. నిద్రలేమితో బాధపడేవారికైతే ఇదొక మంచి మెడిసిన్ అనుకోండి. ఒకటీ రెండూ అనికాదు.. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి బూడిద గుమ్మడికాయతో. వాత.. పిత్త దోషాలను బ్యాలెన్స్ చేయడంలో.. కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది బాగా పనిచేస్తుందిజ బూడిద గుమ్మడికాయలో పుష్కలంగా కాల్షియం.. మెగ్నీషియం.. పొటాషియం.. జింక్ సమృద్ధిగా ఉండి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Next Story