కోట్లాది రూపాయలు కాదు.. ఈ మూడు విషయాలే మిమ్మల్ని నిజమైన ధనవంతులుగా మారుస్తాయ్..!

by Javid Pasha |   (  Updated:2025-07-19 07:00:40  IST  )

కోట్లాది రూపాయలు కాదు.. ఈ మూడు విషయాలే మిమ్మల్ని నిజమైన ధనవంతులుగా మారుస్తాయ్..!

కోట్లాది రూపాయలు కాదు.. ఈ మూడు విషయాలే మిమ్మల్ని నిజమైన ధనవంతులుగా మారుస్తాయ్..!
X

దిశ, ఫీచర్స్ : సంతోషంగా జీవించడానికి డబ్బు (ధనం) ఒక అవసరం కావచ్చు. కానీ అదొక్కటి మాత్రమే సర్వస్వం కాదు అంటారు పెద్దలు. ఎక్కువ మొత్తంలో బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండటం, ఎక్కువమంది అనుచరులను కలిగి ఉండటం, గొప్ప హోదాలో ఉండటం, మరింత సక్సెస్ కోసం పరుగెత్తడం ఇవేవీ నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు. వీటికంటే ముఖ్యంగా మీరు 1. పీస్‌ఫుల్ పార్ట్‌నర్(Peaceful Partner)ను, 2. ప్రేమగల కుటుంబాన్ని (Loving Family), జీవితంలో కనీస అవసరాలు తీర్చగల స్థిరమైన ఆదాయం(stable income) కలిగి ఉంటే చాలు. మీరే నిజమైన ధనవంతులు అంటున్నారు నిపుణులు.

పీస్‌ఫుల్ పార్ట్‌నర్

స్థిరమైన మనస్తత్వం, ప్రశాంతమైన వ్యక్తిత్వం కలిగిన భాగస్వామిని కలిగి ఉంటే మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఎల్లప్పుడూ మీకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటారు. భావోద్వేగ సమతుల్యతను(Emotional balance) అందిస్తారు. అన్ని విషయాల్లోనూ అర్థం చేసుకుంటారు. అవసరమైనప్పుడు మిమ్మల్ని ఓదారుస్తారు, కోపంలో ఉంటే శాంతపరుస్తారు, మీ కలల సాకారానికి సహకరిస్తారు. మీ లక్ష్యాల్లో సపోర్టుగా నిలుస్తారు. ప్రపంచమంతా ఒక్కటైనా వీరు మాత్రం మీకోసమే, మీవైపే నిలబడతారు. ఈ రకమైన ప్రేమ చాలా అమూల్యమైనది. అది లభించిన వారే నిజమైన ధనవంతులు.

ప్రేమగల కుటుంబం

ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత తగ్గడం కూడా పలు సమస్యలకు కారణం అవుతోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే ప్రేమగల కుటుంబాన్ని కలిగి ఉన్నవారే సంతోషంగా ఉంటారనేది జగమెరిగిన సత్యం. ఎక్కువ మొత్తంలో డబ్బు, హోదా కలిగిన వారికంటే వీరే ఎక్కువ ఆనందంగా జీవిస్తారు. సమస్యలను, సవాళ్లను కలిసి ఎందుర్కొంటారు. ఆనందాలను, ఆపదలను కలిసి పంచుకుంటారు. పరస్పరం ఎమోషనల్ సపోర్ట్‌ను కలిగి ఉంటారు. అందుకే ఎంత ధనమున్నా ప్రేమగల కుటుంబం లేకపోతే మనశ్శాంతి ఉండదు. అందుకే డబ్బున్నోళ్లు కాదు ధనవంతులంటే.. ప్రేమ ఉన్నోళ్లో నిజమైన ధనవంతులు.

స్థిరమైన ఆదాయం

కోట్లాది రూపాయల ఆదాయం, లగ్జరీ కార్లు లేదా అందమైన భవంతులు కలిగి ఉన్నవారు మాత్రమే ఆనందంగా ఉండలేరు. ఇంకా ఎక్కువ మొత్తంలో సంపాదించాలనే ఆరాటంలో, ఆందోళనలో వీరు అనవసరం ఆందోళనలు, అనారోగ్యాలు కొనితెచ్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీరిని నిజమైన ధనవంతులుగా పరిగణించలేం అంటున్నారు. అది తక్కువ మొత్తంలో అయినా సరే.. ఉన్నంతలో కనీస అవసరాలు తీర్చగల స్థిరమైన ఆదాయం కలిగి ఉన్నవారే జీవితంలో ఎక్కువ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇది అహంకారాన్ని పెంచదు. అన్యాయంగా, అక్రమంగా అధిక ఆదాయం కోసం ఆరాటపడనివ్వదు. పైగా జీవితానికి భద్రతను ఇస్తుంది.వచ్చిన ఆదాయంలోనే మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోవడం, కుటుంబాన్ని పోషించుకోవడం వంటివి ప్రశాంతమైన మానసిక స్థితికి కారణం అవుతాయి. Link

Next Story