- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భవన నిర్మాణాల అనుమతిలో స్పీడప్.. ‘BUILD NOW’ ఆవిష్కరణతో మరింత సులభం..!
భవన నిర్మాణాల అనుమతిలో స్పీడప్.. ‘Build Now’ ఆవిష్కరణతో మరింత సులభం..!

దిశ, తెలంగాణ బ్యూరో : డిజిటల్ గవర్నెన్స్ వైపు సాహసోపేతమైన అడుగులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత భవన అనుమతి వేదిక ‘బిల్డ్‌నౌ’ను ఇటీవలే ఆవిష్కరించింది. ఈ సంచలనాత్మక వ్యవస్థ కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ ద్వారా నిర్మాణ అనుమతులు వేగిరం చేస్తూ పట్టణ పాలనలో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఇంతకుముందున్న వ్యవస్థ కంటే ఇది వేగవంతంగా పనిచేస్తోందని అధికారులు చెబుతున్నారు. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లకు అనుమతులు జారీలో వేగవంతంగా పనిచేస్తోందని అధికారులు చెబుతున్నారు.
నిమిషాల్లోనే..
భవన నిర్మాణ అనుమతులు, డ్రాయింగ్ స్క్రూట్నీ ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. పనితీరులో ఇది ఒక బెంచ్ మార్క్‌గా నిలుస్తుంది. ఈ అత్యాధునిక వ్యవస్థ భవన నిబంధనలు, అనుమతులకు సంబంధించి ప్రజల అవసరాలను వేగంగా తీర్చడంతో పాటు విశ్వసనీయంగా, స్నేహపూర్వకంగా ఉంటుంది. ప్రజలు, నిర్మాణదారుల కోసం ఇది ఒక శక్తివంతమైన అధునాతన వ్యవస్థ. భారత దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూట్నీ వ్యవస్థగా బిల్డ్ నౌ నిలుస్తుంది. ఈ కొత్త వ్యవస్థ అనేక విప్లవాత్మక లక్షణాలను కలిగి ఉంది. ప్రస్తుతం అమలవుతున్న టీజీబీపాస్ లో ఇన్ స్టాంట్ అప్రూవల్, సింగిల్ విండో వేర్వేరుగా ఉన్నాయి. కొత్త వ్యవస్థ ద్వారా ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ), బిల్డింగ్ పర్మిషన్, లేఅవుట్ పర్మిషన్, ట్రాన్స్ ఫర్ డవలప్మెంట్ రైట్స్(టీడీఆర్), అక్రమ నిర్మాణాలకు నోటీసుల జారీ వరకు అన్నింటికి ఒకే అఫ్లికేషన్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
3915 దరఖాస్తులు..
రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్లు, లేఅవుట్లకు సంబంధించి 3,915 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటికి ‘బిల్డ్ నౌ’ ద్వారానే అనుమతులు జారీచేస్తున్నారు. వచ్చినవాటిలో 1309 దరఖాస్తులకు అనుమతులు జారీచేశారు. మరో 1569 దరఖాస్తులు పురోగతిలో ఉండడంతోపాటు అనుమతులు జారీచేయడనికి అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు నిబంధనలకు విరుద్దంగా ఉన్న 191 దరఖాస్తులను మాత్రం తిరస్కరించినట్టు అధికారులు చెబుతున్నారు.
115బహుళ అంతస్తుల భవనాల కోసం…
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీపీసీ పరిధిలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించడానికి 115 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఏడు దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. మరో 70 దరఖాస్తులు అధికారుల పరిశీలనలో ఉన్నాయి. రెండింటిని మాత్రమే అధికారులు తిరస్కరించారు. మరో 30 దరఖాస్తులకు సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో పెండింగ్ లో పెట్టారు.






