Shocking study : మొబైల్‌ఫోన్ వాడే పిల్లలకు బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే చాన్స్.. 520% ఆ రిస్క్ ఎక్కువ..!

by Javid Pasha |   (  Updated:2025-08-13 10:58:34  IST  )

Shocking study : మొబైల్‌ఫోన్ వాడే పిల్లలకు బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే చాన్స్.. 520% ఆ రిస్క్ ఎక్కువ..!

Shocking study : మొబైల్‌ఫోన్ వాడే పిల్లలకు బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే చాన్స్.. 520% ఆ రిస్క్ ఎక్కువ..!
X

దిశ, ఫీచర్స్ : మీ పిల్లలు తరచుగా మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారా? అయితే జర జాగ్రత్త..! ఎందుకంటే సంవత్సరంపాటు అలా వినియోగించిన పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్ అభివృద్ధి చెందే ప్రమాదం ఉందని ఇటీవలి ఒక అధ్యయనం పేర్కొన్నది. పిల్లలకు మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్ల వాడకం ప్రమాదకరమని హెచ్చరించింది.

ఈ మధ్య పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. కొందరు పిల్లలైతే ఫోన్ చేతికిస్తే కానీ అన్నం తినమని మారాం చేస్తుంటారు. అలాగని పిల్లలకు ఫోన్ ఇచ్చే అలవాటు చేస్తే పేరెంట్స్ వారి జీవితాన్ని రిస్క్‌లో పడేసినట్లే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే సాధారణంగా 3 నుంచి 6 సంవత్సరాల మధ్య మెదడు డెవలప్ అవుతున్న స్టేజ్‌లో ఉంటుంది. ఈ దశలో మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడితే అధిక రేడియేషన్‌కు గురవుతారు. ఏడాదిపాటు ఇది కొనసాగితే గనుక పిల్లల్లో మెదడు కణితులు (Brain tumors) అభివృద్ధి చెందే ప్రమాదం 520% పెరుగుతుందని అధ్యయనం పేర్కొన్నది.

సహజంగానే మొబైల్ ఫోన్‌లు విడుదల చేసే రేడియోఫ్రీక్వెన్సీ రేడియేషన్ (RF-EMR) పిల్లల సున్నితమైన మెదడు కణాలపై ప్రభావం చూపుతుందని అధ్యయనం స్పష్టం చేసింది. దీనివల్ల గ్లియోమా, మెనింజియోమా వంటి బ్రెయిన్ ట్యూమర్‌ల ప్రమాదం పెరుగుతుందని పేర్కొన్నది. అలా జరగకూడదంటే.. తల్లిదండ్రులు ఆరేండ్లలోపు పిల్లల స్క్రీన్ టైమ్‌ను చాలా వరకు పరిమితం చేయాలి. మొబైల్ ఫోన్ వాడకుండా నివారించాలి. సురక్షితమైన టెక్ అలవాట్లను ప్రోత్సహించడం, రేడియేషన్ ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం, డిజిటల్ డిటాక్స్ కోసం ఓపెన్ యాక్టివిటీస్‌ను ప్రోత్సహించడం వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. Link

Next Story