వైట్‌నర్ యూజ్ చేయకుండానే.. పెన్నుతో రాసింది మాయం.. ఎలాగంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-02 15:13:20  IST  )

నోట్ బుక్ పై బాల్ పాయింట్ పెన్నుతో రాస్తున్నప్పుడు ఏదైనా తప్పు దొర్లితే దాన్ని తుడిపేయడానికి ప్రయత్నిస్తాం

వైట్‌నర్ యూజ్ చేయకుండానే.. పెన్నుతో రాసింది మాయం.. ఎలాగంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: నోట్ బుక్ పై బాల్ పాయింట్ పెన్నుతో రాస్తున్నప్పుడు ఏదైనా తప్పు దొర్లితే దాన్ని తుడిపేయడానికి ప్రయత్నిస్తాం. కొందరైతే ప్రస్టేషన్‌లో అదే పెన్నుతో రఫ్ చేస్తారు. దీంతో పేపర్ మొత్తం పాడైపోతుంది. కానీ.. చాలా మందికి ఆ సమయంలో వెంటనే వైట్నర్ గుర్తుకు వస్తుంది. దానిని కరెక్ట్ చేసేందుకు వైట్‌నర్ వాడుతాం. పెన్నుతో రాసిన దాన్ని వైట్నర్‌తో తొలగించవచ్చు. కానీ, అది తొలగించినట్లుగా ఏర్పడుతుంది. ఏదో రాసి తుడిచినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. అంతేకాదు కాగితం పై మరింత తెల్లగా ఉపరితలం మీద ఒక పొరలా కనిపిస్తుంది. అంటే ఇది కాగితం పై ఒక పొరలాగా పనిచేస్తుందే తప్ప రాసిన దాన్ని పూర్తిగా తొలగించలేదు.

అయితే పెన్సిల్‌తో రాసింది మాత్రం ఎరేజర్‌తో పూర్తిగా తుడిచేస్తాం. ఈ తరుణంలో ఇకపై పెన్సిల్ రాతలను ఎరేజర్‌తో తుడిపినట్లు ..పెన్నుతో రాసిన వాటిని ఈజీగా చెరిపేయవచ్చు. చైనాకు చెందిన పరిశోదకులు ఒక ప్రత్యేక పెన్నును రూపొందించారు. ఆ ప్రత్యేక పెన్ తో రాయడంతో పాటు తుడిపేయడం కూడా చేయవచ్చు. దీంతో కాగితాన్ని ఏ మాత్రం పాడు చేయకుండా, రాసిన దాన్ని క్షణాల్లో ఎరేజ్ చేయవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story