- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Technology : వావ్ కిడ్ బ్రో.. టెలిస్కోప్ తయారు చేసిన పదేళ్ల బాలుడు!
పదేళ్ల బాలుడు టెలిస్కోప్ తయారు చేయడమంటే ఎన్ని రోజులు శిక్షణ తీసుకున్నాడో అనుకుంటారు కావచ్చు. కానీ జావాంగ్ మింగ్ యాంగ్ అలాంటిదేమీ చేయలేదు. కేవలం ఆన్‌లైన్ వీడియోలు చూసి ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు.

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ కేవలం సౌకర్యం మాత్రమే కాదు. సరికొత్త ఆవిష్కరణలకు దారితీసే గొప్ప టెక్నిక్ అని నిరూపించాడు ఓ పదేళ్ల బాలుడు. పేరు జావాంగ్ మింగ్ యాంగ్. మూడవ తరగతి చదువుతున్న ఇతను స్కూల్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఒక అద్భుతమైన ఆవిష్కరణకు తెరతీశాడు. కార్డ్‌బోర్డ్ & ఇంట్లో లభించే వస్తువులను ఉపయోగించి సుమారు 4 డాలర్ల(28 యువాన్) ఖర్చుతో సొంతంగా టెలిస్కోప్‌ను తయారు చేశాడు. ఇదేదో కేవలం ప్రాజెక్ట్ వర్క్‌కు మాత్రమే పరిమితమయ్యేలా ఉంటే ఎవరూ పట్టించుకోకపోయేది కానీ.. నిజమైన టెలిస్కోప్ మాదిరి పనిచేసేలా రూపొందించడంతో అది కాస్త వైరల్‌గా మారింది. సదరు బాలుడి ప్రతిభకు ప్రపంచం ఆశ్చర్యపోతోంది.
పదేళ్ల బాలుడు టెలిస్కోప్ తయారు చేయడమంటే ఎన్ని రోజులు శిక్షణ తీసుకున్నాడో అనుకుంటారు కావచ్చు. కానీ జావాంగ్ మింగ్ యాంగ్ అలాంటిదేమీ చేయలేదు. అతను కేవలం ఆన్‌లైన్ వీడియోలు చూసి, టెలిస్కోప్ ఎలా తయారు చేయాలో నేర్చుకుని, స్కూల్ సైన్స్ క్లాస్‌లో నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాడు. టెలిస్కోప్ తయారీలో భాగంగా ఆన్‌లైన్‌లో ముఖ్యమైన మిర్రర్, సెకండరీ మిర్రర్&ఐపీస్ కొని, వాటిని చేతితో పాలిష్ చేశాడు. టెలిస్కోప్ బాడీని కార్డ్ బోర్డ్, కర్రలు, కాటన్ స్వాబ్స్, బాటిల్ క్యాప్‌లు& పీవీసీపైప్‌లతో తయారు చేశాడు. ఇంటి చుట్టూ ఉన్న వ్యర్థాలను సృజనాత్మకంగా ఉపయోగించి, పూర్తి ఆప్టికల్ పనితీరుతో టెలిస్కోప్‌ను తయారు చేశాడు. అంతేకాదు ఈ టెలిస్కోప్ ద్వారా చంద్రుడి మీద ఉన్న గుంటలు
తాను తయారు చేసిన టెలిస్కోప్‌తో చంద్రుడి మీద ఉన్న గుంటలు (Craters) స్పష్టంగా కనిపిస్తాయని జావాంగ్ మింగ్ యాంగ్ నిరూపించాడు. ఇది మాత్రమే కాకుండా ఆ బాలుడు ఇప్పటికే పలు ఇతర పరికరాలను కూడా తయారు చేశానని పేర్కొన్నాడు. అయితే తాజాగా తయారు చేసిన టెలిస్కోప్ ద్వారా అతని ప్రతిభ ప్రపంచానికి తెలిసిపోయింది. నిజమైన సంఘటనకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు అతనిని ‘కిడ్ బ్రో’ అపి ప్రశంసిస్తున్నారు. సాంకేతిక నిపుణులు సైతం అతని పనితీరు ఇతర విద్యార్థులకు, సాంకేతిక నిపుణులకు స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడుతున్నారు. ఇక బాలుడు తయారు చేసిన టెలిస్కోప్ ఉపయోగాల విషయానికి వస్తే బేసిక్ అస్ట్రానమి అబ్జర్వేషన్‌కు ఉపయోగపడుతుందని, చంద్రుడి మీద గుంటలను, టూనార్ డీటెయిల్స్‌ను స్పష్టం గా చూడవచ్చునని, అదనంగా ఎడ్యుకేషనల్ పర్పస్‌కు చాలా ఉపయోగకరమని చెబుతున్నారు సాంకేతిక నిపుణులు.






