Viral Video : పెళ్లి కూతురి డ్యాన్స్ చూసి దడుసుకున్న కొత్త పెళ్లి కొడుకు.. ఇలా దొరికిపోయానేంట్రా.. నేనే ఎక్స్‌ట్రా అనుకున్నా కానీ..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-01 13:22:36  IST  )

పెళ్లి అంటేనే మోస్ట్ స్పెషల్ అకేషన్. అలాంటి అకేషన్‌లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయకపోతే.. గెస్ట్‌లకు కూడా కిక్కు ఉండదు. కచ్చితంగా నవ వధూవరులు స్టెప్ వేయాలని డిమాండ్ చేస్తరు

Viral Video : పెళ్లి కూతురి డ్యాన్స్ చూసి దడుసుకున్న కొత్త పెళ్లి కొడుకు.. ఇలా దొరికిపోయానేంట్రా.. నేనే ఎక్స్‌ట్రా అనుకున్నా కానీ..
X

దిశ, ఫీచర్స్ : పెళ్లి అంటేనే మోస్ట్ స్పెషల్ అకేషన్. అలాంటి అకేషన్‌లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయకపోతే.. గెస్ట్‌లకు కూడా కిక్కు ఉండదు. కచ్చితంగా నవ వధూవరులు స్టెప్ వేయాలని డిమాండ్ చేస్తరు. కనీసం కాలు కదిపి, చిన్న స్మైల్ ఇచ్చినా చాలు అనుకుంటారు. ఇలా అతిథుల నుంచి రిక్వెస్ట్ తర్వాత స్టెప్స్ వేసిన వరుడు.. వధువును కూడా డ్యాన్స్ చేయమని ఎంకరేజ్ చేశాడు. దీంతో ఆమె ముందుగా కాస్త మొహమాటపడినా.. తర్వాత డ్యాన్స్ ఇరగదీసింది. ఫ్లోర్ స్టెప్స్ కూడా వేసేసింది. ఇది చూసిన కొత్త పెళ్లి కొడుకు దడుసుకున్నాడు. ఇలా దొరికిపోయానేంట్రా బాబు.. నేనే ఎక్స్‌ట్రా అనుకున్నా కానీ ఈ పిల్ల నాకంటే ఎక్స్‌ట్రాలా ఉందే అన్నట్లు ఫేస్ పెట్టేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మీకు గనుక ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైతే మీ పరిస్థితి ఏంటి? అని చర్చించుకుంటున్నారు. దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్లు.. ‘నాకు క్లబ్ డ్యాన్సర్ భార్యగా వచ్చిందని రోజు డ్యాన్స్ చేయించుకుంటా?’, ‘అందుకే కొన్ని సార్లు ఎక్స్‌ట్రాలకు పోవద్దు’, ‘ప్రాంక్ అని అక్కడి నుంచి వెళ్లిపోతా’, ‘మందు పాతర అని తెలియక దానిమీద కాలు వేశాడు’, ‘ఏముంది జంప్ ఇంక’, ‘కానీ డ్యాన్స్ మాత్రం అదరగొట్టేసింది’.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Click For Tweet..

Next Story