- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఫీచర్స్: భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నిలువెత్తు నిదర్శనం చీర. మహిళలకు చీరలతో భావోద్వేగమైన అనుబంధం ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. దశాబ్దాల కాలంలో రాణులు ధరించే చీరలు, నగలు వారి రాజసాన్ని మరింతగా పెంచుతుంది. మీరు ఎప్పుడైనా రాణుల ఫోటోలు గమనించినట్లైతే.. వారు చీరల మీద రెండు చేతుల వెనుక నుంచి ఒక దుపట్టా ఉంటుంది. ఇదే రాణి రాజసానికి వన్నె తెస్తుందిని అనుకుంటారు.
అయితే, ఇప్పుడే ట్రెండ్‌గా మారింది. ఇదే ట్రెండ్‌ను ప్రముఖ మళయాల టెలివిజన్ జంట స్వసికా విజయ్, ప్రేమ్ జాకబ్ తమ పెళ్లి వేడుకలకు ఫాలో అయ్యారు. ఆమె తన కంజీవరం చీరను ప్రత్యేకమైన బ్లౌజ్ డిజైన్‌తో తీర్చిదిద్దారు. ఆమె భుజంపై వేసుకున్న స్కాలోప్ దుపట్టా తన రూపాన్ని మరింత అందంగా, స్టైల్‌గా మార్చేసింది. చాలామంది సెటబ్రెటీలు ఈ ‘శారీ విత్ దుపట్టా’నే ఎంచుకుని రాణిగా కనిపిస్తున్నారు. ఇది నవతరం పెళ్లి కూతుర్లు ఎంపిక చేస్తున్న నూతన ట్రెండ్. మిరుమిట్లు గొలిపే చీరతో, ఒంటినిండా ఆభరణాలు, మేలి ముసుగు ధరించి, చేతిపై దుపట్టా వేసుకుంటే.. చూసినవాళ్ల కళ్లు చెదిపోవాల్సిందే. ఎలాంటి చీరలకైనా ఈ దుపట్టా చక్కగా ఉంటుంది.






