- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Alert for iPhone users : ఐఫోన్ వాడుతున్నారా..? మీ పర్సనల్ డేటా హ్యాక్ అవ్వొచ్చు జాగ్రత్త!
Alert for iPhone users : ఐఫోన్ వాడుతున్నారా..? మీ పర్సనల్ డేటా హ్యాక్ అవ్వొచ్చు జాగ్రత్త!

దిశ, ఫీచర్స్ : మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే బీ కేర్ ఫుల్..! ఎందుకంటే మీ పర్సనల్ డేటా(data) హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెప్సాన్స్ టీమ్( Indian Computer Emergency Response Team - CERT-In) స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. అందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
*తాజా సమాచారం ప్రకారం.. యాపిల్‌కు చెందిన ఐఫోన్(iPhone) అండ్ ఐప్యాడ్(iPad) యూజర్లకు భారత ప్రభుత్వానికి చెందిన CERT-In టీమ్ హై సివిరిటీ(High severity) హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే iOS, iPadOS లోని కొన్ని లోపాలు, హానికరమైన అప్లికేషన్లు (Malicious applications) ఉన్నాయి. దీనివల్ల ఆ డివైజ్‌లలోని డేటాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసే అవకాశం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెప్సాన్స్ టీమ్ పేర్కొన్నది.
*ముఖ్యంగా iPhone XS, ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన మోడల్స్, అలాగే iPad Pro, iPad Air, iPad mini వంటి వివిధ ఐప్యాడ్ మోడల్స్‌లో, అలాగే iOS 18.3 లేదా అంతకంటే ఓల్డ్ వెర్షన్లలో లోపాలు ఉన్నాయని CERT-In వెల్లడించింది. కాబట్టి మీ డేటా హ్యాక్ అవకుండా ఉండాలంటే యూజర్లు తమ ఐఫోన్లను తాజా వెర్షన్ (iOS 18.5)కు అప్డేట్(Up grade) చేయాలని సూచించింది.






