- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొబ్బరి నీళ్లు ఏ టైమ్‌లో తీసుకోవడం మంచిది?
పగటిపూట హైడ్రేటింగ్ డ్రింక్స్ ఇష్టపడుతుంటారు జనం. ఇవి మన దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని కూడా అందిస్తాయి.

దిశ, ఫీచర్స్: పగటిపూట హైడ్రేటింగ్ డ్రింక్స్ ఇష్టపడుతుంటారు జనం. ఇవి మన దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని కూడా అందిస్తాయి. ఈ లిస్ట్‌లో కొబ్బరి నీళ్లు కూడా ఉండగా.. ఇంతకీ వీటిని ఏటైమ్‌లో తీసుకుంటే మంచిదనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కాగా కోకోనట్ వాటర్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయని.. ఒక కప్పులో 45 కేలరీలు మాత్రమే ఉండే ఈ పానియాన్ని సోడ లేదా ఇతర షుగర్ డ్రింక్స్ తీసుకోవాలని టెంప్ట్ అయిన ప్రతీసారి తీసుకోవచ్చని చెప్తున్నారు.
* రోగనిరోధక శక్తిని పెంచి, జీవక్రియను సక్రమంగా నిర్వహించే కొబ్బరి నీళ్లు.. సాయంత్రం కాకుండా ఉదయాన్నే మితంగా తాగాలని కొందరు ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
* నేచురల్ ఎలక్ట్రోలైట్స్‌కు మూలంగా ఉన్న కోకోనట్ వాటర్.. వ్యాయామం తర్వాత బాడీని హైడ్రేట్ చేసేందుకు చూజ్ చేసుకోవచ్చు.
* రక్తంలో పొటాషియం ఎక్కువగా ఉన్నట్లయితే కొబ్బరినీళ్లు తాగవద్దు. వీటిలో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. కాబట్టి కిడ్నీ వ్యాధి, హార్ట్ రిథమ్ డిజార్డర్ ఉన్నవారు తీసుకోకూడదు.
* కొందరు వ్యక్తులు నిద్రవేళకు ముందు కొబ్బరి నీళ్లను హైడ్రేటింగ్ కోసం చూజ్ చేస్తారు. అయితే ఈ పద్ధతి మీ బాడీ, స్లీప్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో గమనించండి.






