పెళ్లి కూతురు అందంగా ఉండటంతో ముచ్చటపడిన వరుడు.. డాక్టర్ చెప్పిన విషయం విని షాక్!

by Disha Web Desk 8 |
పెళ్లి కూతురు అందంగా ఉండటంతో ముచ్చటపడిన వరుడు.. డాక్టర్ చెప్పిన విషయం విని షాక్!
X

దిశ, ఫీచర్స్ : పెళ్లి రెండు అక్షరాలే అయినా ఇద్దరి వ్యక్తుల నిండు నూరేళ్ల జీవితం ముడి పడి ఉంటుంది. ఇక పెళ్లి అనగానే ఒక వ్యక్తి ఎన్ని ఆశలతో ఉంటాడు. తన భార్యను బాగా చూసుకోవాలి, ఆమె అందంగా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటారు. నిశ్చితార్థం కాగానే వారు తమకు కాబోయే భార్య గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇలానే ఓ వ్యక్తి పెళ్లి చూపులకు వెళ్లాడు. అమ్మాయి బాగుండటంతో,పెళ్లికి ఒకే చెప్పి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. అయితే అమ్మాయికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో, తానే ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించిన వరుడికి డాక్టర్ చెప్పినది విని షాక్ అయ్యాడు. ఒక్కసారిగా ఆయనకు ఊహించని షాక్ తగిలింది.

అసలు ఏమైంది అనుకుంటున్నారా? చైనాలోని హుంబై ప్రావిన్స్‌లో 27 ఏళ్ల యువతికి వ్యక్తితో నిశ్చితార్థం అయ్యింది. అయితే పెళ్లి సమయంలో ఆమె వైద్య పరీక్షలు చేయించుకోగా, ఆమెకు షాకింగ్ న్యూస్ తెలిసిందే. యువతిలో వృషణాలు మగ హార్మోన్లు, స్పెర్మ్‌లను ఉత్పత్తి చేస్తున్నట్లు తేలింది. ఆడపిల్లగా పుట్టిన ఆమెకు , పీరియడ్స్ కాలేదు అలాగే రొమ్ముల పరిమాణం కూడా పెరగలేదు. దీంతో ఆసుపత్రిలో చూపెట్టుకోగా ఆమె అసాధారణ హార్మోన్ల స్థాయి వల్లనే ఇలా జరుగుతుందని చెప్పారంట. కానీ వివాహ సమయంలో గైనకాలిజిస్ట్‌కు చూపెట్టుకోగా ఆమె, అమ్మాయి కాదు, అబ్బాయి అని తేలింది. దీంతో తన కుటుంబ సభ్యులు, పెళ్లి చేసుకోబోయే వరుడు ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీంతో ఈఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed