ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారని చెరువులో దూకిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే..? (వీడియో)

by Rajesh |
ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారని చెరువులో దూకిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే..? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం మత్తులో సరదాకు చేసిన ఓ పని యువకుడి ప్రాణాన్ని బలిగొంది. స్నేహితులు ఛాలెంజ్ చేశారని మద్యం మత్తులో ఓ యువకుడు నీళ్లలో దూకాడు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు ఫ్రెండ్స్ కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి వెళ్లారు. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత మత్తులో నలుగురు నదిలో స్నానం చేయడానికి దిగారు. తాగిన మైకంలోనే స్నేహితులు రెచ్చగొట్టడంతో సాజిద్ అనే యువకుడు నదిలోకి దూకి ఈతరాక అలాగే చనిపోయాడు. సాజిద్ ను కాపాడాల్సింది పోయిన స్నేహితులు వీడియో తీయడం కలకలం రేపింది. సాజిద్ ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Click Here For Twitter Post..

Next Story

Most Viewed