హేమతో నాకు అంత పరిచయం లేదు.. బర్త్ డే అంటే వెళ్లానని హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్!

by Samataha |
హేమతో నాకు అంత పరిచయం లేదు.. బర్త్ డే అంటే వెళ్లానని హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్!
X

దిశ, సినిమా : ప్రస్తుతం టాలీవుడ్‌లో రేవ్ పార్టీ ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలా మంది సీనియర్స్, జూనియర్స్ బెంగళూరులోని రేవ్ పార్టీకి అటెండ్ అయినట్లు తెలుస్తోంది. ఒకొక్కరుగా బయటకు రావడంతో ఇది చర్చానీయంశంగా మారిపోయింది. ముఖ్యంగా దీంట్లో నటి హేమ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే పాల్గొన్న వారందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని విచారణ చేస్తున్నట్లు బెంగుళూరు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక్కొక్కటిగా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి.

అయితే ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆషి రాయ్ కూడా పాల్గొందని,తన బ్లడ్ శాంపిల్స్ పోలీసులు కలెక్ట్ చేసి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ యంగ్ బ్యూటీ, షాకింగ్ కామెంట్స్ చేసింది. బర్త్ డే పార్టీ అని పిలిస్తే వెళ్లి వచ్చాను తప్పా నాకు ఏం తెలియదు అంటూ ఆమె తెలిపింది. వాసు నాకు బ్రదర్ లాంటి వారు.. పుట్టిన రోజు అని చెప్తే వెళ్లి కేక్ కట్ చేసి వచ్చాను అంతే, నాకు అంతకు మించి ఏం తెలియదు. మీరే నాకు సపోర్ట్ చేయాలి అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అలాగే నటి హేమ గురించి మాట్లాడుతూ.. ఆమె నాకు అంతగా పరిచయం లేదు. గతంలో కొన్ని సార్లు కలిశాను అంతే అని తెలిపింది. అయితే హేమ ఈ పార్టీకి హాజరైందా అని అడగ్గా నాకు ఏం తెలియదంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed