బీఆర్ఎస్ నేత దారుణ హత్య.. హుటాహుటిన కొల్లాపూర్ బయలుదేరిన కేటీఆర్

by Mahesh |
బీఆర్ఎస్ నేత దారుణ హత్య.. హుటాహుటిన కొల్లాపూర్ బయలుదేరిన కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లి గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి (53) దారుణ హత్యకు గురయ్యాడు. తమ గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్ద నిద్రించిన శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో గొడ్డళ్లతో నరికి చంపారు. కాగా ఈ ఘటన నియోజకవర్గంలో సంచలనంగా మారింది. అయితే రాజకీయ కక్ష, కాంగ్రెస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేత హత్య విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన కొల్లాపూర్ బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed