ఎస్‌ఎఫ్‌ఏ లైంగిక వేధింపులు.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

by Rajesh |
ఎస్‌ఎఫ్‌ఏ లైంగిక వేధింపులు.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
X

దిశ, పేట్‌బషీరాబాద్: మహిళా పారిశుధ్య కార్మికురాలని లైంగికంగా వేధిస్తున్న వీడియోలు బయటపడటంతో అధికారులు కఠిన చర్యలు దిశగా అడుగులు వేస్తున్నారు. గాజులరామారం సర్కిల్ సూరారంలో ఎస్‌ఎఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే వ్యక్తి తనకింద పనిచేస్తున్న ఓ మహిళ కార్మికురాలను గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వారం రోజుల క్రితమే సదరు ఎస్ఎఫ్ఐ ఫిర్యాదు రావడంతో బీసీ మల్లారెడ్డి అతనిని సస్పెండ్ చేసి విచారణ చేస్తున్నారు. తాజాగా అతనిని శాశ్వతంగా విధులనుంచి తొలగించేందుకు ఉన్నత అధికారులకు సిఫార్సు చేస్తానని ఆయన తెలిపారు. ఇతరత్రా విషయాలు చట్టపరంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. కాగా జంట సర్కిల్ పరిధిలో గతంలో ఇలాంటి వ్యవహారాలు బయటపడ్డాయి. తాజాగా ఏ వ్యవహారంపై కొన్ని వీడియోలు మాధ్యమాలలో హల్చల్ చేస్తున్నాయి.

Next Story