ఎన్టీఆర్‌తో ఇంత చనువుగా ఫోటో దిగిన ఈమె ఎవరో తెలుసా..?

by Prasanna |
ఎన్టీఆర్‌తో ఇంత చనువుగా ఫోటో దిగిన ఈమె ఎవరో తెలుసా..?
X

దిశ, సినిమా: ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తారక్ కు బర్త్ డే విషేష్ తెలిపారు. అయితే, ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ తో ఒక ఆవిడ చనువుగా ఉన్నది. ఆమె ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

ఆమె ఎవరో కాదు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి. ఈ ఏడాది మార్చిలో తారక్, తన భార్యతో కలిసి బెంగళూరు వెళ్లాడు. ప్రశాంత్ నీల్ ఇంట్లో అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో వారందరూ సరదాగా ఫొటోలు దిగారు. అప్పుడు తీసుకున్న ఫొటోనే ఇది. ఇప్పుడు ఆమె ఈ ఫోటోని పోస్ట్ చేసి ఎన్టీఆర్ కు పుట్టిన రోజు విషెస్ తెలిపింది లిఖితా రెడ్డి.

ఈమెకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. ఖాళీగా ఉన్నప్పుడు అతని సినిమాలే ఎక్కువుగా చూస్తుందట. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో ఇంటికి వచ్చేసరికి ఆమె ఆనందానికి అవధులు లేవు. ఇక ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో ఒక మూవీ రానుంది. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసిన సమాచారం.

Next Story