మొగుడంటే ఇలా ఉండాలి.. యువతిని పెళ్లాడటానికి బంధువులను 28 కి.మీ నడిపించిన వరుడు..

by Disha Web |
మొగుడంటే ఇలా ఉండాలి.. యువతిని పెళ్లాడటానికి బంధువులను 28 కి.మీ నడిపించిన వరుడు..
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లిచేసుకునే వరుడు వధువు గృహానికి వారి వారి సాంప్రదాయాలతో కార్లోనో, గుర్రం పైనో, గుర్రం బండిపైనో, వెళ్లడం చూస్తుంటాం. కానీ ఓ వరుడు, అతని కుటుంబసభ్యులు మాత్రం వారి ఊరినుంచి వధువు ఇంటికి వరకు ఏకంగా 28 కిలో మీటర్లు కాలినడకన వెళ్లి పెళ్లితంతు కానిచ్చేశారు. వింటుంటేనే ఔరా అనిపిస్తుంది కదా. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది.. అలా నడవడం వారి సాంప్రదాయమా తెలుసుకుందాం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే..

ఒడిశాలోని రాయగడ జిల్లా శునఖండీకి చెందిన నరేశ్ ప్రస్కాకు... దిబలపాడు గ్రామానికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. సరిగ్గా వారి పెళ్లి సమయానికి అక్కడ డ్రైవర్లు నిరసనను తెలిపారు. అందుబాటులో వాహనాలు లేకపోవడంతో వరుడు వధువు గ్రామానికి ఎలా చేరుకోవాలో తెలియక చివరికి కాలినడకన 28 కిలోమీటర్లు నడక కొనసాగించారు. అలా శుక్రవారం తెల్లవారుజుమున వధువు గ్రామానికి చేరుకుని వివాహం చేసుకున్నారు.

Also Read..

ఒంటరిగా ఉంటే అలా ఉండాలని నా భార్య ఫోర్స్ చేస్తోంది.. పేరెంట్స్‌ను కూడా ఉండనివ్వట్లే..Next Story