- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక బిల్డ్ నౌలోనూ టీడీఆర్.. బిల్డర్లు, డెవలపర్లకు అందుబాటులో వివరాలు
ఏవియేషన్, డిఫెన్స్, రైల్వే శాఖల స్థలాల ప్లాన్స్, మ్యాప్స్ సైతం..

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ బీపాస్ స్థానంలో తీసుకొచ్చిన బిల్డ్ నౌలోను మార్పులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులకే పరిమితమైన ఈ బిల్డ్ నౌలో త్వరలోనే ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్ (టీడీఆర్)లను కూడా పెట్టే దిశగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ బిల్డ్ నౌ పోర్టల్ ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మానిటరింగ్ చేస్తుంది. డీటీసీపీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అన్ని విభాగాల్లోనూ బిల్డ్ నౌ ద్వారానే అనుమతులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టీడీఆర్ మాత్రం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోనే జారీచేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో…
భవన నిర్మాణ అనుమతులతో పాటు గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ జారీ చేసిన టీడీఆర్ ల సమాచారం కూడా బిల్డర్లు, యజమానుల సౌకర్యార్థం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ‘బిల్డ్ నౌ’లో టీడీఆర్ ల సమాచారం అందుబాటులో ఉంచితే, అవసరమైన బిల్డర్లు, యజమానులు వాటిని కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుందని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ప్రస్తుతం టీడీఆర్ ల సమాచారం జారీ చేసిన జీహెచ్ఎంసీ, వాటిని తీసుకున్న యజమానుల వద్దనే ఉండిపోవటంతో తీసుకున్న అనుమతిని ఉల్లంఘించి అదనంగా అంతస్తులను నిర్మించిన భవన యజమానులు, బిల్డర్లు టీడీఆర్ క్రయవిక్రయాల కోసం మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ క్రమంలో టీడీఆర్ లను అమ్మేవారు, కొనుగోలు చేసే వారు నష్టపోతున్నట్టు గుర్తించిన జీహెచ్ఎంసీ టీడీఆర్ ల పూర్తి సమాచారాన్ని బిల్డ్ నౌలో అందుబాటులో ఉంచితే వాటి క్రయ విక్రయాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
సర్వే నెంబర్లు కాదు..
గ్రేటర్ హైదరాబాద్ లో ఏవియేషన్, డిఫెన్స్, రైల్వే శాఖకు చెందిన స్థలాలకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం ‘బిల్డ్ నౌ’లో సర్వే నెంబర్ల వరకు మాత్రమే ఉన్నాయని, ఇకపై ‘బిల్డ్ నౌ’లో ఏవియేషన్ కు సంబంధించిన స్థలాల మ్యాప్ లు, ప్లాన్ లను కూడా అందుబాటులో ఉంచాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఏవియేషన్, డిఫెన్స్, రైల్వే స్థలాలని అనుమానం వచ్చినపుడు దరఖాస్తుదారుడు ‘నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్ వోసీ)’ని సమర్పించాల్సి వస్తుండగా, అందుకు ఖర్చుతో పాటు సమయం ఎక్కువ పట్టి, నిర్మాణ అనుమతుల జారీలో ఆలస్యమవుతున్న విషయాన్ని కూడా గుర్తించిన అధికారులు ఆయా స్థలాల మ్యాప్ లు, ప్లాన్ లను బిల్డ్ నౌలో పెట్టాలని భావిస్తున్నారు. సర్వే నెంబర్లు మాత్రమే ఉండటంతో భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే వారు సర్వే నెంబర్లకు బై నెంబర్లను సృష్టించి, అధికారులను తప్పుదోవపట్టించి నిర్మాణ అనుమతులు పొంది నిర్మాణాలు ప్రారంభించగానే వివాదాలు తలెత్తుతున్న విషయాన్ని జీహెచ్ఎంసీ పరిశీలిస్తుంది. సర్వే నెంబర్లతో పాటు ఏవియేషన్, డిఫెన్స్, రైల్వే శాఖకు స్థలాల మ్యాప్ లు, ప్లాన్ లను బిల్డ్ నౌలో అందుబాటులో ఉంచితే, భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు దారుడు అర్హుడా? కాదా? అన్న విషయం క్షణాల్లో తేలిపోయే అవకాశముంటుందని జీహెచ్ఎంసీ భావిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్థలాల విషయంలో ఎన్ వోసీ ఇవ్వడానికి సులభతరమవుతోందని అధికారులు చెబుతున్నారు.






