- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తరగతి గదుల్లో కాదు.. సామాజిక స్కూల్ ముఖ్యం.!
సమాజంలో ఉండి నేర్చుకునే ప్రాక్టికల్ పాఠం ముఖ్యం అని చెప్తోంది

దిశ, ఫీచర్స్: దేశ భవిష్యత్ తరగతి గదుల్లో ఉందంటారు. కానీ.. నాలుగ్గోడల మధ్య నేర్చుకోవడానికి ఏముంటుంది అని అంటోంది 18 ఏళ్ల హైదరాబాద్ యువతి. జీవితమంటే నాలుగ్గోడల మధ్య నేర్చుకునేది కాదు.. సమాజంలో ఉండి నేర్చుకునే ప్రాక్టికల్ పాఠం ముఖ్యం అని చెప్తోంది.
స్కూల్ పాఠాల ఉపయోగమేంటి.?
విరామం లేని తరగతులు.. స్పెషల్ క్లాసులు.. మార్కులు.. బట్టీ విధానం నచ్చక 12 ఏళ్ల వయసులోనే స్కూల్ మానేయాలనుకుంది వైష్ణవి. సాంప్రదాయ పాఠశాల విద్యా విధానంతో స్కిల్ డెవలప్‌మెంట్ జరగదనేది ఆమె ఉద్దేశం. సమగ్ర ప్రాక్టికల్ తరగతుల నిర్వహణతోనే స్కిల్ డెవలప్‌మెంట్.. జీవితం ఏంటో తెలుస్తుందని ఆలోచించింది. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తేనే జీవిత నైపుణ్యాలు తెలుస్తాయని పేరెంట్స్‌తో కూడా చెప్పింది. స్కూల్లో చదివినవి జీవితంలో ఎంతవరకు ఉపయోగపడతాయనేది తన ప్రశ్న. రోజుకు ఎనిమిది గంటలు స్కూల్లో గడిపినా.. తనకేమీ నేర్చుకున్నట్లు అనిపించట్లేదనీ చెప్పేసింది.
యూట్యూబ్‌లో నేర్చుకోలేమా.?
వైష్ణవికి తరగతి గదిలో నేర్చుకున్న వాటికన్నా ఇంట్లో తమ పేరెంట్స్ ఇచ్చే కోచింగ్ వల్లనే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయని గ్రహించింది. అలాంటప్పుడు స్కూల్ ఉద్దేశమేంటి.? స్కూల్లో కన్నా హోం స్కూ్లింగ్ ద్వారానే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయని చెప్పింది. హోం స్కూలింగ్ ద్వారానే క్వార్టర్లీ ఎగ్జామ్స్ ప్రిపేరైంది. ఫలితాలు గతంలో కంటే మెరుగ్గా వచ్చాయి. వైష్ణవి పేరెంట్స్ కూడా సాంప్రదాయ పాఠశాల విద్యను ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఆచరణాత్మక అభ్యాసాన్నే ప్రోత్సహించేవాళ్లు. యూట్యూబ్‌లో చూసి కొత్త విషయాలు నేర్చుకోవాలి.. కొత్త కార్యకలాపాలు ప్రయత్నించాలని చెప్పేవాళ్లు.
సృజనాత్మకతను అణచివేస్తాయి..
హోం స్కూలింగ్ భవిష్యత్తులో ఒక ట్రెండ్ అయ్యేలా ఉంది. వైష్ణవి లాంటి వాళ్లు హోం స్కూలింగ్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.. స్కూల్లో పిల్లల సమయం సరిగ్గా వినియోగం కాదు. ఎక్కువమంది విద్యార్థులుండటంతో వ్యక్తిగత శ్రద్ధ అసాధ్యం. వైష్ణవి ఎప్పుడూ పాఠ్యప్రణాళికను నిందించలేదు. కానీ ఉపాధ్యాయులకు సమయం లేకపోవడమే పెద్ద సమస్య అని అంటోంది. పాఠ్యాంశాల్లో సృజనాత్మక ప్రయోగాలు ఉన్నా.. సిలబస్ పూర్తి చేయడంలో ఉపాధ్యాయులు వాటిని అమలు చేయలేరు అని అంటోంది. సుదీర్ఘ స్కూల్ సమయం.. రకరకాల పరీక్షలు విద్యార్థుల సృజనాత్మకతను అణచివేస్తాయి.
సాహిత్య ప్రతిభను వెలికితీసింది..
ఐదు సంవత్సరాల హోమ్‌స్కూలింగ్ తర్వాత వైష్ణవి ఈ విధానమే ఉత్తమమైందని చెప్తోంది. వర్క్ లైఫ్‌లో ఒత్తిడి సహజం. స్కూల్ జీవితం కూడా అలా ఉండొద్దని గ్రహించినట్లు చెప్తోంది. హోమ్‌స్కూలింగ్ సమయాన్ని నియంత్రిస్తుంది. పాఠ్యపుస్తకాలే కాదు.. ఇతర వ్యాపకాలపై ఆసక్తి ఏర్పడుతుంది. వైష్ణవి 12 ఏళ్ల నుంచి ఏదో తనకు తోచింది రాయడం మొదలు పెట్టింది. ఇప్పుడు నాలుగు నవలలు కూడా రాసి రికార్డు సృష్టించింది. అంటే హోం స్కూలింగే ఆమెలోని సాహిత్య ప్రతిభను వెలికితీసింది. ఇంకా తైక్వాండో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కూడా. బుక్ కవర్ డిజైనింగ్.. వీడియో ట్రైలర్‌స్ క్రియేషన్ వంటి సామాజిక నైపుణ్యాలు పెరిగాయి.
హోమ్‌స్కూలింగ్‌తో స్వీయ ప్రేరణ..
హోమ్‌స్కూలింగ్ వైష్ణవికి జీవన నైపుణ్యాలను నేర్పింది. ఉదయం లేవడం.. వ్యాయామం.. శ్లోకాలు చదవడం.. బట్టలు ఉతకడం.. ఇంటి పనుల్లో సహాయం చేయడం ఇలా అన్నింట్లోనూ ఉంది. స్కూల్లో మంచి మార్కుల కోసం బాహ్య ప్రేరణ ఉండేది.. కానీ హోమ్‌స్కూలింగ్‌లో స్వీయ ప్రేరణ నేర్చుకుంది. ఇష్టమైనవి నేర్చుకుంది. ఇష్టం లేనివి వదిలేసింది. తన పని ఇదీ అని ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. అంతకన్నా ఆ ఒత్తడి ప్రభావం పడలేదు. స్కూల్లో ఉన్నప్పుడు ఒత్తిడి వల్ల ఆలోచనలు అణచివేయబడితే.. హోం స్కూలింగ్‌లో తన బలం.. సృజనాత్మకత ఏంటో తెలుసుకుంది.






