- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతరిక్షంలోనూ ఏఐ..! సౌర వ్యవస్థలో సమాచార సేకరణకు యాంటెన్నా..
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సౌర వ్యవస్థలో మిషన్‌లను ట్రాక్ చేయడానికి వెస్ట్రర్న్ ఆస్ట్రేలియాలోని న్యూ నోర్సియాలో అత్యాధునిక డీప్-స్పేస్ యాంటెన్నాను ఏర్పాటు చేసింది.

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక రంగాల్లో దీనిని యూజ్ చేస్తున్నారు. అయితే అంతరిక్ష రంగంలో సమాచార సేకరణకు, పరిశోధనలకు సైతం ఏఐని ఉపయోగించుకునే దిశగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA) సౌర వ్యవస్థలో మిషన్‌లను ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని సేకరించడానికి వెస్ట్రర్న్ ఆస్ట్రేలియాలోని న్యూ నోర్సియా(New Norcia)లో తన అత్యాధునిక డీప్-స్పేస్ యాంటెన్నా(antenna )ను ఏర్పాటు చేసింది. దీనికి న్యూ నోర్సియా 3 (NNO-3) అని పేరు పెట్టారు.
గ్రహాల సమాచార సేకరణకు
న్యూ నోర్సియా 3లో ఏఐ సాంకేతికత మిళితమై ఉంటుంది. 110 మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించబడిన ఈ ప్రాజెక్ట్, సౌర వ్యవస్థ దూర ప్రాంతాలను అన్వేషించే, బహిరంగ వాహనాలతో సమాచారం పంపడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది సౌర వ్యవస్థలో మిషన్‌లను, అంటే స్పేస్‌క్రాఫ్ట్‌లు, గ్రహాలు, నక్షత్రాలు, చంద్రులు లేదా ఇతర ప్రాంతాలను అన్వేషిస్తున్నప్పుడు వాటి స్థానం, డేటా వంటి వాటి సిగ్నల్‌లను గుర్తించి సమాచారాన్ని స్టోర్ చేసుకోవడం, అనుసంధానించిన వ్యవస్థకు పంపడం చేస్తుంది. ఏఐ సాంకేతికతతో సమ్మేళనం చేయబడి నందున ఇది సిగ్నల్ డిటెక్షన్‌ను కచ్చితంగా అడ్జస్ట్ చేయడానికి, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను ఫిల్టర్ చేయడానికి, యాంటెన్నా స్థానాన్ని ఆటోమేటిగ్గా అడ్జస్ట్ చేయడానికి కూడా సహాయపడుతుంది.
సిగ్నల్ డిటెక్షన్
న్యూ నోర్సియా 3 యాంటెన్నా సౌర వ్యవస్థకు దూర ప్రాంతాలలో ఉన్న స్పేస్‌క్రాఫ్ట్‌లతో సమాచారాన్ని మెరుగుపరుస్తుంది. ఉదాహరణకు జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్(JUICE ), BepiColombo వంటి మిషన్‌లకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఇందులోని క్రయోజెనిక్ కూలింగ్ (-263°C వరకు), అలాగే AI సాంకేతికత బిలియన్ల కిలోమీటర్ల దూరం నుండి వచ్చే అతి బలహీనమైన సిగ్నల్‌లను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది.
అంతరిక్ష పరిశోధనలకు
ఏఐ (AI) సిగ్నల్ డిటెక్షన్‌ను కచ్చితంగా సర్దుబాటు చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తొలగిస్తుంది. యాంటెన్నా స్థానాన్ని కూడా ఆటోమేటిగ్గా అడ్జస్ట్ చేస్తుంది. సమాచార సామర్థ్యాన్ని పెంచుతుంది. మొత్తానికి న్యూ నోర్సియా 3 (NNO-3) యాంటెన్నా, AI సాంకేతికతతో సమ్మేళనం చేయబడి, సౌర వ్యవస్థకు సంబంధించిన దూర ప్రాంతాల నుండి సమాచారాన్ని సమర్థవంతంగా స్వీకరించడానికి, ఎనలైజ్ చేయడానికి, పంపడానికి రూపొందించబడింది. ఇది యూరప్ శాస్త్రవేత్తల అంతరిక్ష అన్వేషణలకు, పరిశోధనలకు కీలకంగా మారనుంది.






