Viral News: మనిషి యూరిన్‌తో గుడ్లు ఉడికిస్తారు.. కానీ జనలంతా లొట్టలేసుకోని తింటున్నారు.. మామూలు మ్యాటర్‌ కాదు ఇది!

by Vennela |   (  Updated:2025-04-01 08:56:24  IST  )

Virgin Boy Eggs: ప్రపంచంలో ప్రతి దేశంలోని కొన్ని ఆహారాలు వాటి అద్భుతమైన రుచికి ప్రసిద్ధి చెందాయి.

Viral News: మనిషి యూరిన్‌తో గుడ్లు ఉడికిస్తారు.. కానీ జనలంతా లొట్టలేసుకోని తింటున్నారు.. మామూలు మ్యాటర్‌ కాదు ఇది!
X

దిశ, వెబ్ డెస్క్: Virgin Boy Eggs: ప్రపంచంలో ప్రతి దేశంలోని కొన్ని ఆహారాలు వాటి అద్భుతమైన రుచికి ప్రసిద్ధి చెందాయి. చాలా మంది ఇష్టపడే రుచికరమైన వంటకాలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి కూడా అభిరుచులు మారుతుంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన వంటకాలు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో విభిన్న సంప్రదాయాలు, అలవాట్లు, పద్దతులు ఎన్నో ఉన్నాయి. ఒక ప్రాంతంలో అనుసరించే పద్ధతులు మరో ప్రాంతంలో ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త కూడా అలాంటిదే. ఎందుకంటే అక్కడ మానవ మూత్రంతో ఈ వంటకాన్ని చేస్తారు.

చైనాలో వింత ఆహారపు అలవాట్లు ఉంటాయి. అక్కడి జనం రకరకాల వంటకాలను రుచి చూస్తుంటారు. అక్కడి ప్రజలు అనుసరించే కొన్ని ఆహారపు అలవాట్లు మిగత దేశాల ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చైనాలోని జెజియాంగ్ రాష్ట్రంలో డాంగ్ యాంగ్ ప్రాంతంలో వర్జిన్ బాయ్ ఎగ్ అనేది స్పెషల్ డిష్. చైనా ప్రజలు దీనిని రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. వర్జిన్ బాయ్ ఎగ్స్ అనేది వసంతకాలంలో చైనీయులు అల్పాహారంగా తినే ఒక ప్రత్యేకమైన వంటకం. తూర్పు చైనా నగరమైన డోంగ్‌యాంగ్‌లో ప్రాథమిక పాఠశాలల్లో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అబ్బాయిల నుండి మూత్రాన్ని సేకరించడానికి బకెట్లను ఉంచుతారు. అలా సేకరించిన మూత్రంలో గుడ్లను నానబెట్టి ఉడికిస్తారు.

ఈ సంప్రదాయం శతాబ్దాల నాటిది. మూత్రం వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని నమ్ముతారు. పురాతన కాలంలో దీనిని సాధారణంగా వినియోగించేవారు. వర్జిన్ బాయ్ ఎగ్స్ తయారు చేయడానికి, గుడ్లను ముందుగా మూత్రంలో నానబెడతారు. తర్వాత వీటిని దాదాపు 7 గంటలపాటు ఉడకబెడతారు. మరిగించిన తర్వాత, గుడ్డు శెల్స్ ను తీసివేసి తిరిగి తాజా మూత్రంలో వేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి ఒక పూర్తి రోజు పడుతుంది. ఈ వంటకం పూర్తిగా రెడీ అయ్యాక..గుడ్డులోని తెల్ల భాగం లేత బంగారు రంగులోకి మారుతుంది. పచ్చసొన ఆకుపచ్చగా మారుతుంది. దీనిని అక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా తింటుంటారు.

అయితే సాంప్రదాయ చైనీస్ నమ్మకాల ప్రకారం, కన్య అబ్బాయిల మూత్రంలో అనేక "మర్మమైన శక్తులు" ఉన్నాయని చెబుతుంటారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని, పురుష శక్తిని పెంచుతుందని..దుష్టశక్తులను దూరం చేయడంలో.. అదృష్టాన్ని తీసుకురావడంలో కూడా సహాయపడుతుందని నమ్ముతారు. ఈ ప్రయోజనాలను పొందేందుకు పదేళ్ల వయస్సున్న పిల్లల మూత్రాన్ని ఉదయాన్నేసేకరిస్తారు. ఉదయాన్నే వచ్చే మూత్రంలో ఆరోగ్య ప్రయోజనాలు దాటి ఉన్నాయని బలంగా నమ్ముతారు. ఇది మిగతా ప్రపంచానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అక్కడి పౌరులు మాత్రం సాధారణ విషయంగానే పరిగణిస్తారు. వీటిని తింటే వేసవిలో స్ట్రోక్ రాదని.. కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతారు. అందుకే డోంగ్ యాంగ్ నగర వాసులు ఈ వంటకాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు.

Next Story