- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్-భారత్ యుద్ధానికి మూహూర్తం పిక్స్.. మహాభారతానికి ఈ వార్‌కు పోలిక అంటూ స్వామిజీ జోస్యం
సోషల్ మీడియాలో పహల్గాం టెర్రర్ ఎటాక్‌పై భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. హిందు, ముస్లింలు సోదరులం... ఇండియాలో ఉన్న ముస్లింలను వేలెత్తి చూపొద్దు.. తప్పు చేసింది పాకిస్తానీలు.. ఇండియాలో ఉన్న

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో పహల్గాం టెర్రర్ ఎటాక్‌పై భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. హిందు, ముస్లింలు సోదరులం... ఇండియాలో ఉన్న ముస్లింలను వేలెత్తి చూపొద్దు.. తప్పు చేసింది పాకిస్తానీలు.. ఇండియాలో ఉన్న ఇతర దేశస్తులను తక్షణమే పంపించేయాలి.. బ్యాన్ చేయాలి.. పాక్‌కు చుక్కలు చూపించాలి.. సింధు నదీ జలాలను ఆపాలి.. టెర్రరిస్టులను ఏరేయాలి.. ఇలా ఎవరి ఒపీనియన్ వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మరో అనుమానానికి దారితీస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న వివాదం.. వార్‌కు దారితీసే అవకాశముందనే సందేహాలు వినిపిస్తున్నాయి.
ఈ మధ్య తల్లిదండ్రుల శృంగారంపై అసభ్యకర కామెంట్స్ చేసి తగిన మూల్యం చెల్లించుకున్నరణ్‌వీర్ అల్లాబాదియా మళ్లీ తన పాడ్‌కాస్ట్‌ను రీస్టార్ట్ చేశాడు. ఈ క్రమంలోనే స్వామి యోగేశ్వరానంద గిరిని ఇంటర్వ్యూ చేశాడు. మే 30, 2025లో ఆరు గ్రహాలు ఒకే స్థానంలోకి రానున్నాయని.. దీనివల్ల వరల్డ్ వార్ జరగొచ్చని ఆయన జోస్యం చెప్పాడు. మహాభారతం లాంటి గొప్ప యుద్ధాలు జరిగిన సమయంలో ఇలాగే గ్రహాలన్నీ ఒకే చోటుకు చేరాయని వివరించారు. దీంతో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భారత్-పాక్ యుద్ధం తప్పదని, ఈయన చెప్పింది దీని గురించేనేమోనని కామెంట్స్ చేస్తుంటే.. ఇలాంటి అల్గారిథమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి స్వామి అని ఇంకొందరు విమర్శిస్తున్నారు.






