- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral News : జలంపైనే జీవనం.. లైఫ్‌లాంగ్ సముద్రం మధ్యలోనే నివసిస్తున్న ‘బజౌ తెగ’ప్రజలు
Viral News : జలంపైనే జీవనం.. లైఫ్‌లాంగ్ సముద్రం మధ్యలోనే నివసిస్తున్న ‘బజౌ తెగ’ప్రజలు

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ప్రజలందరూ ఈ భూమిపైన జనావాసాల మధ్య నివసించడానికే ఇష్టపడతారు. కొందరు అడవుల్లో, కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. అది వారి వారి సాంస్కృతిక, జీవ వైవిధ్యంలో భాగంగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అయితే బజౌ (Bajau) అనే ఒక తెగకు చెందిన ప్రజలు మాత్రం జీవితాంతం సముద్రం మధ్యలో నివసిస్తారు. నీటిలో తప్ప నేలపై ఉండానికి అస్సలు ఇష్టపడరు. ఇందుకు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. వారి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ వారెందుకలా నివస్తారో చూద్దామా?
బజౌ(Bajau).. సముద్రం మధ్యలో నివసించే అరుదైన ప్రజలకు సంబంధించిన తెగ పేరిది. వీరు ఎక్కువగా ఆగ్నేసియాలోని సులు సముద్రం(Sulu Sea) మధ్యలో నివసిస్తుంటారు. అట్లనే ఫిలిప్పీన్స్ దక్షిణ - పశ్చిమ తీరం, ఇండోనేషియాలోని సులవేసీ చుట్టూ, మలేషియాలోని సబా ప్రాంతం, అలాగే బోర్నియో తీరాలలో కూడా నివసిస్తుంటారు. అయితే వీరు నివసిస్తున్నది సముద్రం మధ్యలోని నేలమీద మాత్రం కాదు. సాంప్రదాయకంగా తమ సంచార జీవన శైలికి అనుగుణంగా ఉండే ‘లెపా - లెపా’ అనే చిన్న పడవల్లో లేదా సముద్రం మధ్యలో ఉండే స్తంభాలపై నిర్మించిన గుడిసెల్లో జీవిస్తుంటారు.
నీటిలో నివాసానికి కారణం?
బజౌ తెగ ప్రజలను సాధారణంగా ‘‘సీ జిప్సీస్’’ లేదా ‘‘సముద్ర యాత్రికులు’’గా పిలుస్తుంటారు. వీరికి నేషనాలిటీ గానీ, స్థిర నివాసం గానీ ఉండవు. డబ్బంటే ఏమిటో తెలియదు. అయితే వీరు తమకు సముద్రంతో ఉన్న లోతైన సాంస్కృతిక బంధంవల్ల దానిని విడిచి పెట్టడానికి ఇష్టపడరు. దీంతోపాటు వారు ఏ దేశంలోనూ పౌరసత్వం లేని స్థితిలో ఉన్నారు. దీనివల్ల వారికి భూమిపై స్థిర నివాసం, విద్య, ఉపాధి లేదా ఆరోగ్య సదుపాయాలు వంటివి అందుబాటులో లేవు. ఆధునిక సరిహద్దులు, వలస రాజ్య యుగంలో ఏర్పడిన చట్టాలు (EX. Malaysian Immigration Act 1959/1963 Laws enacted during the colonial era), స్థానిక సమాజాల నుంచి వచ్చే సోషల్ స్టిగ్మా వారిని భూమిపై స్థిరపడకుండా నిరోధిస్తున్నాయి. అరుదుగా ఎప్పుడైనా ఒకసారి భూమిపైకి వెళుతుంటారు.
ఆహారపు అలవాట్లు
బజౌ ప్రజల ఆహారం పూర్తిగా సముద్రంపైనే ఆధారపడి ఉంటుంది. వారు ఫ్రీడైవింగ్ ద్వారా చేపలు, సీ కుకంబర్స్, ఆక్టోపస్, సీ ఉరర్చిన్స్, షెల్‌ఫిష్‌లను సేకరిస్తారు. స్కూబా గేర్ లేదా ఆక్సిజన్ ట్యాంకులు లేకుండానే చేతితో తయారు చేసుకున్న స్పియర్ గన్స్, అలాగే చెక్క గాగుల్స్‌తో గంటల తరబడి డైవింగ్ చేస్తారు. ఒక్కో డైవ్‌లో వారు 5 నుంచి 13 నిమిషాలు నీటిలోపలి భాగంలో ఉండగలరు. ఎందుకలా అంటే వారి జీవన శైలి వల్ల వారి శరీరాలు జన్యుపరంగా మారిపోయాయి అంటారు నిణులు. అయితే ప్రధానమైన ఆహారం మాత్రం చేపలు. పచ్చివిగానీ, మంటలపై కాల్చుకుని తినడం గానీ చేస్తారు. అలాగే స్థానిక కసావా లేదా రైస్‌ను సముద్రం మధ్య ద్వీపంలో నివసించే ప్రజల నుంచి వాణిజ్యం ద్వారా పొందుతారు. అంటే వారికి చేపలు ఇచ్చి రైస్ తీసుకుంటారు. విషయం ఏంటంటే బజౌ తెగ ప్రజలు పడవల్లోనే జన్మిస్తారు. అక్కడే పెరుగుతారు. అక్కడే మరణిస్తుంటారు. మరణ సమయంలో మాత్రం కొందరు అరుదుగా భూమిపైకి వచ్చి ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారట.
సంస్కృతి, సంప్రదాయాలు
బజౌ తెగ ప్రజల సంస్కృతి అంతా సముద్రంతో ముడిపడి ఉంటుంది. వారు ఓంబోహ్ దిలాట్(God of the sea)ను నమ్ముతారు. ఆత్మలను పూజిస్తూ ఆధ్యాత్మిక నమ్మకాలను కలిగి ఉంటారు. ఇక ఈ ప్రజలు తమ సంప్రదాయ వివాహ వేడుకల్లో ప్రదర్శించే నృత్యాల సందర్భంగా ‘పలావ్’ (Wind instrument), ‘తగుంగ్గో’ అండ్ గబ్బాంగ్’’ వంటి సంగీత వాయిద్యాలను వాయిస్తారు. ‘ఒకిల్’ అనే కోరల్ లేదా సున్నపు రాయితో చెక్కిన కళాకృతులను కలిగి ఉంటారు. సాంస్కృతింగా వీరు కుల, మత, లింగ భేదాలు పాటించరు. సమానత్వ భావాన్ని కలిగి ఉంటారు.






