- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Earth: మానవ జాతి అంతం అయ్యేది అప్పుడే.. మన తర్వాత భూమిని పరిపాలించేది ఎవరంటే?
పరిశోధకుల చెప్పిన దాని ప్రకారం, మనుషులు అంతమైన తర్వాత భూమిలో చాలా మార్పులు వస్తాయని అంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కొన్నేళ్ల క్రితం ఈ భూమిని డైనోసార్లు ( Dinosaur ) పరిపాలించాయన్న విషయం మనకీ తెలిసిందే. కాలక్రమేణా ఇవి మొత్తం అంతమైపోయాయి. ఆ తర్వాత భూమిపై ఎన్నో జీవులు వచ్చినప్పటికీ.. మానవ జాతి భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం, మనుషులు భూమిపై ఆధిపత్య జాతులుగా ఉన్నారు. ఇది కూడా శాశ్వతం కాదు. డైనోసార్లు ఎలా అయితే అంతరించిపోయయో .. కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత మానవ జాతి కూడా పూర్తిగా అంతమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే, మనుషుల తర్వాత భూమిని పరిపాలించడానికి ఏదైనా జంతువు పుట్టుకొస్తుందా ? లేక మానవ జాతే మళ్ళీ భూమిపైకి వస్తారా? మనుషులు కాకుండా, ఇతర జీవాలు ఏవి భూమిపైకి వచ్చినా వాటి ప్రతాపాన్ని చూపిస్తాయని అనే శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
మానవ జాతి అంతరించడానికి చాలా సమయం ఉంది. ఆ తర్వాత ఏ జీవులు భూమిని పరిపాలిస్తాయో తెలుసుకోవాలనే ఉత్సాహం ప్రతి ఒక్కరిలో ఉంది. పరిశోధకుల చెప్పిన దాని ప్రకారం, మనుషులు అంతమైన తర్వాత భూమిలో చాలా మార్పులు వస్తాయని అంటున్నారు. అన్నింటిలో ఆక్టోపస్‌లు ( Octopus ) అత్యంత ఆధిపత్య పాత్ర పోషించే అవకాశం ఉంది. వాటి తెలివితేటలు, సమస్య పరిష్కారించగలిగే నైపుణ్యం వలన అవి భూమిని పరిపాలిస్తాయని పరిశోధకులు వెల్లడించారు.






