చాటింగ్ స్టైల్‌తో సంబంధాలు బలోపేతం..! 75% అంచనా ఇదే..

by Javid Pasha |

అరిజోనా యూనివర్సిటీ నిపుణుల అధ్యయనం ప్రకారం.. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు చేసుకునే టెక్ట్సింగ్ నమూనాలను బట్టి, వారి దీర్ఘకాలిక సంబంధాన్ని 75% కచ్చితత్వంతో అంచనా వేయవచ్చు.

చాటింగ్ స్టైల్‌తో సంబంధాలు బలోపేతం..! 75% అంచనా ఇదే..
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఏదైనా మాట్లాడుకోవాలంటే ప్రత్యక్షంగా కలుసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్లు. కానీ మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆత్మీయ పలకరింపులు మొదలుకొని అఫీషియల్ కన్వర్జేషన్ల వరకు నేడు టెక్ట్స్ మెసేజ్‌లద్వారానో, వాట్సాప్ చాటింగ్‌ల ద్వారానో కొనసాగిస్తున్నారు. పైగా ఈ పద్ధతి ఒక విధమైన కంఫర్ట్‌ను ఇవ్వడంతోపాటు కన్వర్జేషన్‌ను మరింత సులభంగా, ఆసక్తిగా మల్చడం ద్వారా వ్యక్తుల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని అరిజోనా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఒక కొత్త అధ్యయనం పేర్కొన్నది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం.

అరిజోనా యూనివర్సిటీ నిపుణులు నిర్వహించిన అధ్యయన ఫలితాల ప్రకారం.. రిలేషన్‌షిప్‌లో భాగస్వాములు లేదా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు చేసుకునే టెక్ట్సింగ్ నమూనాలను బట్టి వారి దీర్ఘకాలిక సంబంధాన్ని 75% కచ్చితత్వంతో అంచనా వేయవచ్చు. ఎందుకంటే ఇవి సంబంధాలను ప్రభావితం చేస్తాయి. టెక్ట్సింగ్ చేయడం అంటే ఇక్కడ చాటింగ్ లేదా సందేశాలు పంపుకోవడంలో స్థిరత్వం కనబర్చడం. అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది కాకుండా అవసరం మేరకు, ఆరోగ్య కరమైన సందేశాలతో కూడిన చాటింగ్ సంభాషనలు సంబంధాల మధ్య నమ్మకాన్ని, స్థిరత్వాన్ని పెంచుతాయి.

ముఖ్యంగా టెక్స్టింగ్ నమూనాలు (Texting Patterns) అంటే.. రియాక్షన్ టైమింగ్, రిప్లయ్ టైమింగ్. ఒక మెసేజ్ చేసిన వెంటనే వెంటనే స్పందిస్తున్నారా? వెంటనే రిప్లయ్ ఇస్తున్నారా? అనే దానిని బట్టి ఇద్దరి మధ్య సంభాషణలో సానుకూల, ప్రతికూల ధోరణలు వ్యక్తం అవుతాయి. అవి సంబంధాన్ని ప్రభావితం చేస్తాయి. వెంటనే స్పందించడం, రిప్లయ్ ఇవ్వడం అనేది ఇక్కడ సానుకూల ధోరణిని పెంచుతుంది. అవతలి వ్యక్తిపై నమ్మకాన్ని కలిగిస్తుంది.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 12 నెలల పాటు అనేకమంది జంటలను గమనించి, ఆరోగ్యవంతమైన, అర్థవంతమైన సంబంధాలు కలిగి ఉన్న జంటల టెక్ట్సింగ్ నమూనాలను విశ్లేషించారు. కాగా నిరంతరం ఏదో ఒక సందేశం పంపుతూ ఉండటంకంటే.. అవసరమైనప్పుడు, ఒక విధమైన టైమింగ్ అనుకొని ఆ సమయంలో చాటింగ్ చేసుకోవడం ఆనందాన్ని పెంచడంతోపాటు సమయాన్ని సద్వినియోగం చేసుకున్న భావనను కలిగిస్తుంది.

ఇక ఎప్పుడు పడితే అప్పుడు సందేశాలు పంపుకునే అస్థిరతమైన పద్ధతిని ఫాలో అయ్యే జంటలు లేదా వ్యక్తుల సందేశాల్లో తరచుగా నిరాశ, నిస్పృహ, డ్రై రిప్లైలు, నెమ్మదిగా స్పందించడాలు.. ఒకే అక్షరంతో రిప్లయ్ ఇవ్వడం వంటి నిర్లక్ష్య ధోరణులు కనిపిస్తాయి. సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇద్దరి మధ్య ఆత్మ విశ్వాసం, నమ్మకం పోయేలా చేస్తాయి. కాబట్టి టెక్ట్సింగ్‌(Texting) విషయంలో సమయం, సందర్భం, స్థిరత్వం ఉండేలా మల్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవడం, ఎమోషనల్ సపోర్ట్ అందించడం, ఆసక్తిగా మాట్లాడటం, శ్రద్ధగా స్పందించడం వంటివి సంబంధాన్ని బలోపేతం చేయడంలో కీ రోల్ పోషిస్తాయి. Link

Next Story