అబ్బా.. ఏం మర్యాద..! ఆంధ్రా అల్లుడికి తెలంగాణ రుచి చూపించిన అత్త

by Bhoopathi Nagaiah |

వెటకారం చేయాలన్నా.. కొత్త అల్లుళ్లకు మర్యాదలు చేయాలన్నా ఉభయ గోదావరి జిల్లాలకు పెట్టింది పేరు.

అబ్బా.. ఏం మర్యాద..! ఆంధ్రా అల్లుడికి తెలంగాణ రుచి చూపించిన అత్త
X

దిశ, వెబ్‌డెస్క్ : వెటకారం చేయాలన్నా.. కొత్త అల్లుళ్లకు మర్యాదలు చేయాలన్నా ఉభయ గోదావరి జిల్లాలకు పెట్టింది పేరు. సంక్రాంతి పండుగ సమయంలో గోదావరి జిల్లాల్లోని ఏ ఇంటికి కొత్త అల్లుడు వెళ్లినా ఆ మర్యాదలకు, వెజ్, నాన్ వెజ్, పిండి వంటల రుచులకు మైమరిచిపోవాల్సిందే. వందల రకాల రుచులను ఆస్వాదించలేక భుక్తాయాసంతో గింగిరాలు తిరగాల్సిందే. అయితే సంస్కృతి, సంప్రదాయం ఈ సంక్రాంతికి తెలంగాణను సైతం చుట్టుముట్టింది. హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో కొత్త అల్లుళ్లకు వందకు పైగా రుచులను వడ్డించి సర్‌ప్రైజ్ చేశారు అత్తింటివారు.

కాకినాడకు చెందిన మల్లికార్జున్‌కు హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌‌కు చెందిన యువతితో వివాహం అయింది. సంక్రాంతి సందర్భంగా తెలంగాణకు వచ్చిన అల్లుడికి అత్తమామ ఖమ్మంపాటి క్రాంతి, కల్పన దంపతులు పసందైన వంటలు చేసి వడ్డించారు. వెజ్, నాన్ వెజ్, బాగారా రైస్‌, స్వీట్స్, పులిహోర, పండ్లు, పిండివంటలు సహా 130 రకాల విభిన్న రకాల వంటకాలను వడ్డించారు. సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మాజీ సర్పంచ్ మంగ రాములు తన అల్లుడు, కుమార్తెను సంక్రాంతికి ఆహ్వానించి పసందైన 108 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించి ఆహా.. అనిపించారు.

అయితే ఇప్పటి వరకు ఆంధ్రాకే పరిమితం అయిన ఈ సంప్రదాయం తెలంగాణకు ఎంట్రీ ఇవ్వడంతో ఆంధ్ర అల్లుళ్లు షాకవుతున్నారు. గోదావరి జిల్లాలను మరిపించేలా మర్యాదలు చేసి వంటకాలు వడ్డించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. తెలంగాణ స్పెషల్ వంటకాలను కొసరి కొసరి వడ్డించి ఇక్కడి రుచులను పరిచయం చేయడంతో కొత్త అల్లుళ్లు మర్చిపోలేకపోతున్నారు. ఈ సంక్రాంత్రిని ఎప్పటికీ ఆస్వాదిస్తూనే ఉంటాం అంటూ భార్యలతో కలిసి సెలబ్రేషన్స్‌లో మునిగిపోతున్నారని కొత్త అల్లుళ్లు.

Next Story