- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీనేజ్ అంటే 20 ఏండ్ల వరకే.. మెదడుకు మాత్రం 35 ఏండ్ల వరకు!
నిజానికి మెదడు మెచ్యూర్ అయ్యే వయసు 30 నుంచి 35 ఏండ్లు అని అధ్యయనాలు చెబుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : ‘ఇరవై ఏండ్లు దాటినా ఇంకా స్టేబుల్‌గా ఉండలేకపోతున్నాను. ఇతరులందరూ సక్సెస్ అవుతున్నారు. నేను మాత్రం వెనకబడిపోతున్నాను’ అని భయపడుతున్నారా? అయితే ఇక నుంచి వదిలేయండి. ఎందుకంటే అది మీ తప్పు కాదు. మీ మెదడు ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. అదేంటి టీనేజ్ దాటింది కదా అనుకోకండి. 13 నుంచి 19 సంవత్సరాల వయసును టీనేజ్ అంటున్నప్పటికీ అది మీ శరీరానికి తప్ప మెదడుకు కాదు. వాస్తవానికి మెదడు టీనేజ్ వేరని, అది 30 వరకు కొనసాగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. నిజానికి మెదడు మెచ్యూర్ అయ్యే వయసు 30 నుంచి 35 ఏండ్లు అని చెబుతున్నాయి.
మెదడు నిర్మాణం, దాని పరపక్వత విషయాలను తెలుసుకునే అధ్యయనంలో భాగంగా వేలాది ఎంఆర్ఐ(MRI) స్కాన్‌లతో చేసిన న్యూరోఇమేజింగ్ అధ్యయనాలు (ఉదా.. ABCD స్టడీ, UK Biobank, Human Connectome Project) ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. ఈ సందర్భంగా పరిశోధకులు మెదడు పూర్తిగా పరిపక్వం అవ్వడానికి 30–35 ఏళ్ల వరకు పడుతుందని కనుగొన్నారు.
మఖ్యంగా ఇంపల్స్ కంట్రోల్, ఎమోషనల్ రెగ్యులేషన్, లాంగ్ టర్మ్ ప్లానింగ్, స్వీయ నియంత్రణకు బాధ్యత వహించే మెదడు భాగమైన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ 30 ఏండ్ల వరకు నెమ్మదిగా స్ట్రాంగ్ అవుతూనే ఉంటుంది. అందుకే 20-30 ఏండ్ల మధ్య వయసులో కన్ఫ్యూజన్, ఐడెంటిటీ క్రైసిస్, రిస్క్ తీసుకోవడం, భావోద్వేగ హెచ్చుతగ్గులు వంటివన్నీ సహజమే. నిజమైన మెదడు పరిపక్వత దశ 30 నుంచి 35 ఏండ్లు కాగా, ఇది 30- 60 ఏండ్ల వయసు వరకు స్థిరంగా కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత వృద్ధాప్య లక్షణాలు, ప్రభావాలు కనిపిస్తుంటాయి.






