Technology : గ్లూకోజ్ పెట్టడానికి నరాలు దొరకడం లేదా? ఇదిగో నర్వ్ డిటెక్టర్ టెక్నాలజీ..!

by Javid Pasha |

Technology : గ్లూకోజ్ పెట్టడానికి నరాలు దొరకడం లేదా? ఇదిగో నర్వ్ డిటెక్టర్ టెక్నాలజీ..!

Technology : గ్లూకోజ్ పెట్టడానికి నరాలు దొరకడం లేదా? ఇదిగో నర్వ్ డిటెక్టర్ టెక్నాలజీ..!
X

దిశ, ఫీచర్స్ : ఏదో అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌కి వెళ్తారు. కొన్నిసార్లు పరిస్థితిని బట్టి డాక్టర్లు మీకు గ్లూకోజ్ లేదా ఫ్లూయిడ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ పనిచేయడానికి చేతులు లేదా శరీరంలోని ఇతర భాగాల్లో వెంటనే నరాలు(Nerves) దొరకవు. దీంతో చికిత్సలో కొంత ఆలస్యం కావచ్చు. కానీ ఇదంతా ఒకప్పుడు. ప్రస్తుతం అలాంటి సమస్య లేదు. ఎందుకంటే నరాలను గుర్తించడంలో సహాయపడే మెడికల్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ (medical technologies and equipment) అందుబాటులో ఉన్నాయి. అవేమిటి? ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.

ఏయే పరికరాలు

*నరాలను గుర్తించడానికి అల్ట్రాసౌండ్ -గైడెడ్ రీజనల్ అనస్థీషియా (UGRA), ఎలెక్ట్రోమయోగ్రఫీ (EMG), నర్వ్ మానిటరింగ్ సిస్టమ్స్ వంటి టెక్నిక్స్ (Techniques) నరాల స్థానాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. ఇవి హాని కలిగించకుండా ఇంజెక్షన్‌ ఇవ్వడంలో, గ్లూకోజ్ ఎక్కించడంలో సహాయపడతాయి.

*NIM 3.0 నర్వ్ మానిటరింగ్ సిస్టమ్ : చికిత్సల సమయంలో నరాలను గుర్తించడానికి NIM 3.0 నర్వ్ మానిటరింగ్ సిస్టమ్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. శస్త్ర చికిత్సల సమయంలో మోటార్ నరాలను(motor nerves) గుర్తించడానికి, పర్యవేక్షించడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఇది నరాలు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

* నర్వానా నర్వ్ మానిటరింగ్ సిస్టమ్ : న్యూరోవిజన్ మెడికల్ ప్రొడక్ట్స్ (Neurovision Medical Products)కు చెందిన ఈ టెక్నాలజీ కూడా శస్త్ర చికిత్సల సమయంలో నరాలను గుర్తించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా నరాల సమీపంలోని టిష్యూని మ్యాప్ చేయడానికి, నరాల ఆరోగ్యాన్ని రియల్ టైమ్‌లో పర్యవేక్షించడానికి ఉపయోగిస్తారు. ఇది ఎలక్ట్రోమయోగ్రఫీ(EMG) సిగ్నల్‌ను ట్రాక్ చేస్తుంది. నరాలు దెబ్బతినే సంకేతాలను హెచ్చరిస్తుంది.

*అల్ట్రాసౌండ్ మెషిన్స్ : GE హెల్త్ కేర్, ఫిలిప్స్, సోనోసైట్ వంటి మెడికల్ టెక్నాలజీ ఉత్పత్తులు అల్ట్రాసౌండ్ - గైడెడ్ రీజనల్ అనస్థీషియా (UGRA) కోసం ఉపయోగించే అల్ట్రాసౌండ్ మెషిన్స్ నరాలు, రక్త నాళాలను గుర్తించడంలో సహాయపడతాయి. ఇవి ఇంజెక్షన్ సైట్లను కచ్చితంగా ఎంచుకోవడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా నరాల సమీపంలో ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన సందర్భంలో మేలు చేస్తాయి.

*డయాబెటిక్ న్యూరోపతి డిటెక్షన్ డివైసెస్ : డయాబెటిక్ ఫుట్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (చెన్నై) వీటిని తయారు చేస్తుంది. వైబ్రోథర్మ్ Dx లేదా తర్మో మెట్రీ HCP వంటి పరికరాలు చిన్న నరాలు (Small fiber neuropathy) దెబ్బతినడాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. ఇవి నరాల సెన్సిటివిటీని, ఇంజెక్షన్ సైట్లను ఎంచుకోవడంలో పరోక్షంగా సహాయపడతాయి.

Next Story