Technology : సోలార్ ప్యానెల్స్‌కు ప్రత్యామ్నాయం.. అల్ట్రా థిన్ సోలార్ సెల్స్!

by Javid Pasha |   (  Updated:2025-11-18 10:17:39  IST  )

అల్ట్రా- థిన్ సోలార్ సెల్స్ సెల్స్‌ను భవనాల గోడలు, కిటికీలు, లేదా రూఫ్‌లపై సన్నని ఫిల్మ్‌ల రూపంలో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా విద్యుచ్ఛక్తిగా మార్చుకోవచ్చు

Technology : సోలార్ ప్యానెల్స్‌కు ప్రత్యామ్నాయం.. అల్ట్రా థిన్ సోలార్ సెల్స్!
X

దిశ, ఫీచర్స్ : విద్యుత్ శక్తి వినియోగానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించే సోలార్ ప్యానెల్స్ గురించి మీరు వినే ఉంటారు. ఇంటి పైకప్పుమీదనో లేదా ఇంటిముందు ఎండలోనో ఉంచడం ద్వారా సౌరశక్తిని గ్రహించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. వివిధ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సోలార్ ప్యానెల్స్ పెద్దవిగా ఉంటాయి. అలాగే అవి అవి సూర్యకాంతిని గ్రహిస్తున్నప్పుడు అది పరావర్తనం చెందడం ద్వారా పరిసరాల్లో ఉన్న వ్యక్తులకు అంత సౌకర్యంగా అనిపించదు. కానీ అందుకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు ఐడాహో నేషనల్ లేబొరేటరీ (INL) పరిశోధకులు. ఆస్వీడన్‌లోని అప్‌సాలా యూనివర్సిటీ నిపుణులతో కలిసి ‘అల్ట్రా- థిన్ సోలార్ సెల్స్’లో కాంతి బయటకు ఎస్కేప్ అయ్యే సమస్యకు నానోటెక్ పరిష్కారాన్ని గుర్తించారు.

ఉపయోగాలేమిటి?

*ఫ్లెక్సిబుల్ అండ్ పోర్టబుల్ అప్లికేషన్లు: పేపర్-తిన్ సోలార్ సెల్స్‌ను ఏ విధంగానైనా వంచగలం. ఈ స్వభావం వల్ల వీటిని కర్వ్‌డ్ సర్ఫెస్‌లు (ఉదాహరణకు, భవనాలు, వాహనాలు, డ్రోన్లు), ఫాబ్రిక్ లాంటి పదార్థాలపై అమర్చవచ్చు. ఇవి సోలార్-పవర్డ్ దుస్తులు, బ్యాగ్‌లు, లేదా పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైస్‌లలో ఉపయోగించబడతాయి. ఎక్కడైనా ఎనర్జీని జనరేట్ చేయడానికి కంఫర్ట్‌గా ఉంటాయి.

*బిల్డింగ్-ఇంటిగ్రేటెడ్ ఫోటోవోల్టాయిక్స్ (BIPV): ఈ సెల్స్‌ను భవనాల గోడలు, కిటికీలు, లేదా రూఫ్‌లపై సన్నని ఫిల్మ్‌ల రూపంలో ఇంటిగ్రేట్ చేయవచ్చు. ఇవి సౌందర్యాత్మకంగా, ఆకర్షణీయంగా (Aesthetically and attractively) ఉండి, సాంప్రదాయ సోలార్ ప్యానెల్స్‌కు ప్రత్యామ్నాయంగా భవనాలకు శక్తిని అందిస్తాయి.

* స్పేస్ అప్లికేషన్లు: పేపర్-తిన్ సోలార్ సెల్స్‌ తక్కువ బరువు, అధిక సామర్థ్యం కలిగి ఉండటంవల్ల, స్పేస్‌క్రాఫ్ట్‌లు, శాటిలైట్‌లు, లూనార్/మార్స్ మిషన్‌లలో ఉపయోగించడానికి అనువైనవి. ఇవి స్పేస్‌లో ఎనర్జీ జనరేషన్ కోసం సమర్థవంతమైన ఆప్షన్‌గా పనిచేస్తాయి.

* కాస్ట్-ఎఫెక్టివ్, ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ: ఈ సెల్స్ తక్కువ మెటీరియల్‌ను ఉపయోగిస్తాయి. ఉత్పత్తి ఖర్చులను తగ్గిస్తాయి. కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గిస్తాయి. ఇవి రీసైక్లింగ్‌కు అనుకూలమే కాకుండా పర్యావరణ అనుకూల ఎనర్జీ సొల్యూషన్‌గా పనిచేస్తాయి.

*డిజాస్టర్ రిలీఫ్, రిమోట్ ఏరియాస్: ఈ సెల్స్ తేలికైనవి కాబట్టి రవాణా చేయడం సులభం. దీనివల్ల వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో లేదా రిమోట్ ఏరియాల్లో తాత్కాలిక పవర్ సప్లై కోసం ఉపయోగపడతాయి. స్మార్ట్ ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు లేదా ఇతర గాడ్జెట్లలో ఇంటిగ్రేట్ చేసి, సోలార్ ఎనర్జీతో చార్జింగ్ సౌలభ్యాన్ని కూడా పొందవచ్చు.

Next Story