- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడవుల్లోనూ AI టెక్నాలజీ.. ‘వన్యప్రాణి అకౌస్టిక్ మానిటరింగ్’లో కీరోల్!
అడవుల్లో పక్షి జాతులను, వాటి సంఖ్యను, సంచారాన్ని, సంతానోత్పత్తి ప్రవర్తనలను గుర్తించడంలో ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతోంది.

దిశ, ఫీచర్స్ : అడవుల్లోని జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి, జీవజాల ప్రత్యేకతలను గుర్తించడానికి స్థానిక ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు ఒకప్పుడు ప్రత్యక్ష సర్వేలు నిర్వహించేవి. ఇందుకోసం రోజుల తరబడి అడవుల్లో తిరగాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ‘వైల్డ్ లైఫ్ అకౌస్టిక్ మానిటరింగ్ సిస్టమ్’ అనే ఏఐ ఆధారిత సాంకేతికత ఆ పనిని సులభతరం చేస్తోందని నిపుణులు అంటున్నారు. దీనిని ‘Passive Acoustic Monitoring (PAM) లేదా Bioacoustic Monitoring అని కూడా పిలుస్తారు. రీసెంట్‌గా ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ అటవీ విభాగం ఈ టెక్నాలజీని ఉపయోగించడంతో ఈ టెక్నాలజీ గురించి చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏమిటది? దానివల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏఐ ఆధారిత వన్యప్రాణి అకౌస్టిక్ మానిటరింగ్ టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో అందుబాటులో ఉంది. అయితే ఇండియాలో ఇప్పుడిప్పుడే వినియోగంలోకి తెస్తున్నారు. ముఖ్యంగా ఆయా దేశాల్లోని, రాష్ట్రాల్లోని అటవీ సంరక్షణ విభాగాలు అకౌస్టిక్ సెన్సార్ల(వైల్డ్‌లైఫ్ అకౌస్టిక్ రికార్డర్లు)ను అడవుల్లో ఏర్పాటు చేసి, పక్షులు, ఇతర జంతువుల శబ్దాలను నిరంతరం రికార్డ్ చేస్తున్నాయి. ఈ సెన్సార్లు 24 గంటలూ పని చేస్తూ, మానవ జోక్యం లేకుండా సహజ పర్యావరణ శబ్దాలను సంగ్రహించడంలో అద్భుతంగా సహాయపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
అడవుల్లో రికార్డ్ చేయబడిన శబ్దాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలతో విశ్లేషించడంలో ఈ కొత్త సాంకేతికత సహాయపడుతున్నది. ముఖ్యంగా పక్షి జాతులను, వాటి సంఖ్యను, సంచారాన్ని, సంతానోత్పత్తి ప్రవర్తనలను గుర్తించడంలో, వివరాలను శాస్త్రీయంగా అంచనా వేయడంలో, విశ్లేషించడంలో ఉపయోగపడుతున్నది. ఇది సాంప్రదాయ సర్వేల కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పైగా ఈ వ్యవస్థ దీర్ఘకాలిక బయోడైవర్సిటీ డేటాసెట్లను సృష్టించి, జనాభా పోకడలు, వలసలు, పర్యావరణ మార్పులను ట్రాక్ చేయడంలో సహాయపడుతున్నది.
ముఖ్యంగా వైల్డ్ లైఫ్ అకౌస్టిక్ మానిటరింగ్ సిస్టమ్ అడవుల సంరక్షణను ఆధునిక సాంకేతికతతో మెరుగుపరుస్తూ, అరుదైన పక్షుల ఆవాసాలను కాపాడటానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ అటవీ అధికారులు దీనిని ఉపయోగించడం గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. భవిష్యత్తులో ఇతర అటవీ విభాగాలకు విస్తరించే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు.






