- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tech Life : మనం మారిపోయాం బ్రో.. అంతా Tech మాయ!
Tech Life : మనం మారిపోయాం బ్రో.. అంతా Tech మాయ!

దిశ, ఫీచర్స్ : ‘‘ఫ్యాషన్ షో జరుగుతోంది. ఏయే బ్రాండ్లు ప్రదర్శించారు. క్యాట్ వాక్‌లో పాల్గొన్న సెలబ్రిటీలెవరు? ఇండియా నుంచి ఎవరున్నారు?’’ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఒకప్పుడు గంటలు, రోజుల కొద్దీ ఎదురు చూసేవాళ్లం. కానీ ఇప్పుడు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియా వేగం పెరిగాక.. ఏ సమాచారమైనా క్షణాల్లో తెలిసి పోతుంది? ఎలా సాధ్యం? అంతా టెక్నాలజీ మాయ అని చమత్కరిస్తున్నారు నిపుణులు.
యెస్.. టెక్నాలజీ నిత్య జీవితంలో భాగమైపోయింది. అనేక మార్పులకు కారణమైంది. నేర్చుకునే సామర్థ్యం నుంచి ఇంటరాక్షన్స్ వరకు కీలకపాత్ర పోషిస్తోంది. ఒక విషయంలో టైమ్ స్పెండ్ చేయడం నుంచి రిలాక్స్ అవడం వరకు జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే సాంకేతికత మనం జీవించే విధానాన్నే మార్చేసింది బ్రో.. అంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో కీ రోల్ పోషిస్తున్నది గూగుల్ సెర్చింగ్ ఒకటి. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ల ఆధారంగా ప్రస్తుతం మనం కోరుకునే ప్రతీ సమాచారం మన చేతి వేలికొనల దూరంలోనే ఉందంటున్నారు నిపుణులు. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. 1998లో గూగుల్ సెర్చ్‌లను మొదటిసారిగా ప్రారంభించినప్పుడు సగటను రోజుకు 10 వేల సెర్చింగ్‌లు జరిగాయి. ఇప్పుడు ఆ సంఖ్య రోజుకు 3.5 బిలియన్లకు చేరింది. ఎంత మార్పు!
మెమోరీ పవర్
మీ నెంబర్ తప్ప ఇతరుల ఎంతమంది ఫోన్ నంబర్లు మీకు నోటెడ్ ఉన్నాయి. అట్లెట్ల గుర్తుంటది అంటారా? అలాంటి మర్చిపోయే పరిస్థితులను మరోసారి గుర్తు చేసుకోవడానికి, సంఘటనలను వీక్షించడానికి అనుగుణంగా మనిషి చేసిన ప్రయత్నం మరో ఆధునిక సాంకేతిక పరికరాన్ని ఆవిష్కరించింది. అదే మెమోరీ కార్డ్, హార్డ్ డ్రైవ్. ఏ సమాచారమైన స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే ఫోన్ నెంబర్లు మనం గుర్తు పెట్టుకోకపోయినా అవసరమైనప్పుడు యూజ్ చేసుకునేలా సెల్ ఫోన్‌లో ఫీడ్ చేసుకుంటున్నాం కదా. ఎలా సాధ్యమైంది? అంటే ఓన్లీ టెక్నాలజీ. ఇక మెమోరీ కోసం టెక్నాలజీ అండ్ ఇంటర్నెట్ తరాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఎక్స్‌టర్నల్(external)హార్ట్ డ్రైవ్. పరిశోధకులు ఈ విషయాన్ని ‘‘ కాగ్నెటివ్ ఆఫ్ లోడింగ్ (cognitive offloading)’’అని పిలుస్తారు. మన జ్ఞాపకాలను భద్ర పరించేందుకు ఉపయోగించే బాహ్య పరికాలను ఉపయోగించినప్పుడు ఇది వర్తిస్తుంది.
చదవడం, నేర్చుకోవడం
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక వచ్చిన మరో గొప్ప మార్పు ఏంటంటే.. ఇ-బుక్స్ లేదా రీడర్లను ఉపయోగించడం. దీనివల్ల ప్రజలు గతంకంటే ఇప్పుడు ఎక్కువగా చదువుతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇష్టమైన ఇన్ఫర్మేషన్ చదివేస్తున్నాం కదా.. డిజిటల్ టెక్నాలజీ లేదా డివైస్‌లు తెచ్చిన మార్పు ఇది. మనకెంత మేలు చేసిందో కదూ.. గుర్తుంచుకోవడంలో, లోతైన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో రీడర్లు లేదా ఇ బుక్స్ ఎంతగానో సహాయపడుతున్నాయి.
నైపుణ్యాలు పెరుగుతున్నాయ్..
తరచుగా ఒక స్థిరమైన డివైస్ యూజ్ చేయడం, స్మార్ట్ ఫోన్‌లోనో, ల్యాప్ టాప్‌లోనో మునిగిపోవడం, తరచుగా సోషల్ మీడియాలో గడపడం ఓ విధంగా నష్టమని కొందరు చెబుతున్నా, మరో విధంగా లాభాలు కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా? క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంది. అట్లనే అనేక దేశాల ప్రజలు, వారి అభిరుచులు, ఆసక్తులు, సంస్కృతులు ఇలా ప్రతీ విషయం ఈ ఫేస్ బుక్, ఇన్ స్టా, ఎక్స్ ఇలా సోషల్ మీడియా వేదికల ద్వారా ఈరోజుల్లో ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం. ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాం. సామాజిక అవగాహనకు ఇది దోహద పడుతోంది. టెక్నాలజీ తెచ్చిన మార్పే కదా. అట్లనే వేరియస్ లెర్నింగ్ స్టైల్స్, లెర్నింగ్ మీడయమ్స్ ఆన్‌లైన్ మాద్యమాల ద్వారా లభ్యం అవుతున్నాయి. పిల్లలకు, పెద్దలకు యూజ్ అవుతున్నాయి. ఎలా సాధ్యం? మాయా లేదు మర్మం లేదు అంతా టెక్నాలజీ మాయ! అంటున్నారు నిపుణులు.






