- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మీకు వయసు అయిపోతున్నట్టే!
35వ బర్త్ డే దాటినప్పటి నుంచి చాలామంది వయసు అయిపోతుంది అని లెక్కల వేసుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్ : 35వ బర్త్ డే దాటినప్పటి నుంచి చాలామంది వయసు అయిపోతుంది అని లెక్కల వేసుకుంటారు. అయితే వయసు అనేది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు. అది నెమ్మదిగా, సంవత్సరాల పాటు జరిగే సహజ ప్రక్రియ. సాధారణంగా 30 ఏళ్ల తరువాత శరీరంలో చిన్నచిన్న మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. 60 ఏళ్లకు చేరుకునే సరికి వృద్ధాప్య లక్షణాలు స్పష్టంగా అవుతాయి. ఈ సమయంలో శక్తి తగ్గడం, కొద్దిపాటి పనికే అలసట రావడం, చర్మంపై ముడతలు పడడం, జుట్టు తెల్లబడటం లేదా రాలటం, చూపు–వినికిడి బలహీనపడడం వంటి మార్పులు జరుగుతాయి.
అలాగే కీళ్ల నొప్పులు, నిద్ర తగ్గడం, చిన్న విషయాలు మరచిపోవడం, శరీరం త్వరగా జబ్బు పడటం కూడా కనిపించవచ్చు. ఇవన్నీ మనిషి వయసు పెరుగుతోందని చూపే సహజ సంకేతాలు. పుట్టిన ప్రతిప్రాణికి ఒక దశలో తప్పనిసరిగా వచ్చే మార్పులే ఇవన్నీ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వృద్ధాప్యాన్ని ఎలాగూ ఆపలేం కాబట్టి వయసు గురించి పక్కన పెట్టి జీవితాన్ని ఆస్వాదించమని అంటున్నారు.






