- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్ : భయంకరమైన ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్‌లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. ఇది వచ్చినప్పుడు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. ఏమాత్రం ఆలస్యమైనా ప్రాణం దక్కే అవకాశాలు చాలా అరుదు. అయితే భవిష్యత్తులో ఇటువంటి భయానక పరిస్థితికి చెక్ పెట్టే ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు స్విస్ శాస్త్రవేత్తలు. ఏంటంటే.. రక్త నాళాల్లో నుంచి ప్రవహించి మెదడులో రక్తం గడ్డ కట్టిన చోటికి చేరి స్ట్రోక్‌ను నివారించగల మైక్రో రోబోట్లను తయారు చేశారు. వీటిని చేతి భాగం లేదా తొడ భాగం నుంచి ఒక చిన్న ఇంజెక్షన్ లాంటి సూది ద్వారా రక్తంలోకి వదిలేస్తారు. ఆ తర్వాత అవి రక్తంతో పాటే ప్రయాణిస్తూ మెదడులోని రక్తం గడ్డకట్టిన చోటికి చేరుకుంటాయి. గడ్డను భౌతికంగా పగలగొట్టడం ద్వారా కేవలం నిమిషాల్లోనే మెదడుకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరిస్తాయి.
నిజానికి స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషం చాలా విలువైనది. చికిత్స ప్రారంభించడంలో ఆలస్యమయ్యే కొద్దీ మెదడు కణాలు చనిపోతాయి. అయితే సైంటిస్టులు కొత్తగా డెవలప్ చేసిన మైక్రో రోబోట్లు ఆ గోల్డెన్ అవర్‌ను దాదాపు ఇన్‌స్టంట్‌గా మార్చగలవు. ప్రస్తుతం పరిస్థితి ప్రకారమైతే స్ట్రోక్ రాగానే చికిత్సకోసం వెంటనే అన్ని సౌకర్యాలున్న ఆసుపత్రికి తీసుకెళ్లి, క్యాథెటర్ లేదా ఆపరేషన్ ద్వారా గడ్డ తొలగించాలి. ఇందుకోసం గంటల సమయం పట్టవచ్చు. కానీ ఈ కొత్త మైక్రో రోబోట్లు రక్తనాళాల్లోని అతి చిన్న భాగాలకు కూడా చేరుకోవడం, క్యాథెటర్ చేరలేని ప్రాంతాల్లోనూ చేరి మెదడుకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడంవల్ల డెత్ రిస్క్‌ను తగ్గిస్తాయి. ప్రాథమిక పరీక్షల్లోనూ ఈ రోబోట్లు రియల్ టైమ్‌లో నావిగేట్ అవుతూ, గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించినట్టు తేలింది. కాబట్టి ఈ మైక్రో రోబోట్స్ రాబోయే రోజుల్లో బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలో కీలకపాత్ర పోషించనున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే అంబులెన్స్‌లలో, గ్రామీణ క్లినిక్‌లలో, హైవేలపై పోర్టబుల్ స్ట్రోక్ యూనిట్లలో వీటిని అందుబాటులో ఉంచడంవల్ల వల్ల స్ట్రోక్ ద్వారా సంభవించే మరణాలను చాలా వరకు అడ్డుకోవచ్చు. ప్రపంచ వైద్య రంగంలో ఇదొక గొప్ప ముందడుగు అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.






