- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్విమ్మింగ్ చేసేవారిలో పెరుగుతున్న జ్ఞాపక శక్తి.. ఇంకా ఆ స్కిల్స్ కూడా!
స్విమ్మింగ్ వల్ల మెదడు సామర్థ్యం మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్పారు.

దిశ, ఫీచర్స్ : సమ్మర్ వచ్చిందంటే చాలు. చాలా మందికి స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. సిటీల్లో అయితే పూల్స్‌కి, గ్రామాల్లో అయితే అందుబాటులో ఉన్న చెరువులు, బావులు, కాలువల్లోకి వెళ్లి ఈతకొడుతుంటారు. ఇక ఈత రానివాళ్లు కూడా కొత్తగా నేర్చుకునేందుకు వెళ్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. స్విమ్మింగ్ కేవలం సరదా సంతోషాలను ఇచ్చేది మాత్రమే కాదండోయ్.. అదొక అద్భుతమైన వ్యాయామమని కూడా ఒక న్యూరోసైన్స్ అధ్యయనం పేర్కొన్నది. ఈతవల్ల మెదడుసామర్థ్యం మెరుగవుతుందని తెలిపింది. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో చూద్దామా!
అధ్యయనాల ప్రకారం.. స్విమ్మింగ్ వల్ల ఏరోబిక్ వ్యాయామాలతో కలిగే అన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాదు ఇది మెదడులో కొత్త నరాల కణాలు (neurons) పెరగడానికి సహాయపడతుందని తెలిపింది. ముఖ్యంగా హిప్పోకాంపస్ అనే మెదడు భాగంలో ఈ కొత్త కణాలు ఏర్పడతాయి. దీంతో జ్ఞాపక శక్తి, నేర్చుకునే సామర్థ్యం (Learning Skills) పెరుగుతాయి. అంతేకాకుండా ఈతలో ఉండే లయబద్ధమైన కదలిక, శ్వాస నియంత్రణ, పూర్తి శరీర భాగస్వామ్యం కలిసి మెదడుపై శాంతింపజేసే ప్రభావం పెచుతాయి. దీంతో కాలక్రమేణా ఒత్తిడి స్థాయిలు తగ్గి, భావోద్వేగ సమతుల్యత మెరుగుపడుతుంది. ఫలితంగా మానసిక ఆరోగ్యం మెరుగై, రోజువారీ జీవితం సంతోషంగా అనిపిస్తుంది.






