Summer Food : ఎండాకాలం.. ఎండురొయ్యలు.. కాంబినేషన్ అదుర్స్ కదూ

by Muthe.Rajitha |

వేసవికాలం వచ్చిందంటే ఎండల తీవ్రత అధికంగానే ఉంటుంది గాని, ఈ సీజన్లో దొరికే పండ్లు, ప్రత్యేక ఆహార పదార్థాలు గుర్తుకు తెచ్చుకుంటే ఎండను క్షమించవచ్చు అనిపిస్తూ ఉంటుంది కదా.

Summer Food : ఎండాకాలం.. ఎండురొయ్యలు.. కాంబినేషన్ అదుర్స్ కదూ
X

దిశ, వెబ్ డెస్క్ : వేసవికాలం వచ్చిందంటే ఎండల తీవ్రత అధికంగానే ఉంటుంది గాని, ఈ సీజన్లో దొరికే పండ్లు, ప్రత్యేక ఆహార పదార్థాలు గుర్తుకు తెచ్చుకుంటే ఎండను క్షమించవచ్చు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి ప్రత్యేక ఆహార పదార్థాల్లో ఎండురొయ్యలు కూడా ఒకటి. మిగతా కాలాల్లో కూడా దొరికినా.. అంత శుచిగా అనిపించవు. కాని ఎండకాలంలో మాత్రం వాటి రుచే వేరు. రుచి మాత్రమే కాదు.. ఎండు రొయ్యల్లో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, మూలకాలు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, ఐరన్‌, మేగ్నీషియం, ఫాస్పరస్‌, పోటాషియం, జింక్, సెలీనియం, అయోడిన్, రాగి, మాంగనీస్‌, సోడియం వంటి ఖనిజాలు మన ఆరోగ్యానికి అత్యవసరమైనవి. ఇవన్నీ ఎండు రొయ్యల్లో సమృద్ధిగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

*ఎండు రొయ్యల్లో విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ కూడా ఉంటాయి. ఎండు రొయ్యలను తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాలలో ఒకటి బరువును తగ్గించడం. ఎండు రొయ్యలు తింటే అందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు.

*చిన్నరొయ్యల్లో విటమిన్లు, అయోడిన్, ప్రొటీన్లు, జింక్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గించుకునే ప్రయాణంలో ఉన్నవారు అదనపు పౌండ్లను తగ్గించుకోవాలని చూస్తున్న వారికి ఇవి మంచి ఎంపిక. జుట్టు కుదుళ్లు గట్టిగా వుంచడంలో ఎండు రొయ్యలు ఎంతో మేలు చేస్తాయి.

*రొయ్యల్లో వుండే సెలీనియం క్యాన్సర్‌తో మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు సూచించాయి. శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఎండురొయ్యలు ఎంతో మేలు చేస్తాయి. ఎండురొయ్యల్లో విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం వున్నాయి. వారానికో పక్షానికో ఎండు రొయ్యలు తింటుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

*ఎండు రొయ్యల లో విటమిన్ బి12 ఉండడం వల్ల ఇవి రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. ఎండు రొయ్యలను తరచూ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎండు రొయ్యలను తినేవారిలో ఆల్జీమర్స్ సమస్య తగ్గుతుంది. ఎండు రొయ్యల లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. వీటిని తింటే చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. మొత్తంగా ఎండు రొయ్యలను తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

గమనిక : పైవార్తలో సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడినది. దిశ దీనిని ధృవీకరించలేదు. ఇది కేవలం మీ అవగాహన కోసం ఇస్తున్న సమాచారం మాత్రమే. పైవార్తలో మీకు అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోగలరు.

Next Story