- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోలార్ పవర్‌తో ఐస్‌క్రీమ్.. నెల్లూరి వారి ఆర్గానిక్ రుచులు.!
కస్టమర్ల ఆరోగ్యాన్ని, పర్యావరణ పరిరక్షణనూ పరిగణనలోకి తీసుకొని ఐస్‌క్రీమ్స్ తయారీ చేస్తున్నాడు

దిశ, ఫీచర్స్: ఉద్యోగం, ఉపాధి అంటూ ఎక్కడెక్కడో తిరుగుతాం. ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం. క్రియేటివ్ ఐడియాస్ ఉండాలేగానీ అలాంటి పాట్లు అవసరం లేదని నిరూపించాడు సుహాస్ బి శెట్టి. ఫార్మసీలో పీహెచ్డీ స్థాయికి వెళ్లినా తమ వారసత్వ వ్యాపారమైన ఐస్‌క్రీమ్ బిజినెస్‌లో అడుగుపెట్టి దేశవ్యాప్తంగా ఐస్‌బర్గ్ ఐస్‌క్రీమ్‌ను విస్తరించాడు. కస్టమర్ల ఆరోగ్యాన్ని, పర్యావరణ పరిరక్షణనూ పరిగణనలోకి తీసుకొని ఐస్‌క్రీమ్స్ తయారీ చేస్తున్నాడు.
ఆర్గానిక్ బ్రాండ్..
నెల్లూర్‌కు చెందిన సుహాస్ కుటుంబానికి ఐస్‌క్రీమ్ వ్యాపారం ఉండేది. చిన్నప్పుడు ఐస్‌క్రీమ్‌ల మధ్యే తిరుగుతూ ఆడుకునేవాడు. తర్వాత కొన్నాళ్లకు వ్యాపారం మూతపడింది. సుహాస్ పెద్దోడయ్యాడు. ఫార్మసీలో పీహెచ్డీ చేశాడు. ఎప్పటికైనా తన కుటుంబ వ్యాపారమైన ఐస్‌క్రీమ్ తయారీని తిరిగి ప్రారంభించి వినూత్న రీతిలో నడిపించాలనేది అతడి ఆలోచన. పీహెచ్డీ పూర్తయ్యాక తిరిగి నెల్లూర్ చేరుకున్న సుహాస్ ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను ప్రారంభించాలని డిసైడ్ అయ్యాడు. అందరిలా వెజిటబుల్ ఆయిల్స్, కెమికల్ ప్రిజర్వేటివ్స్ వాడొద్దనకున్నాడు. ఎందుకంటే అలా చేసేవి నిజమైన ఐస్‌క్రీమ్‌లు కావు. హానికరమైన ఫ్రోజన్ డెసర్ట్‌లు.
ఆరోగ్యమే ముఖ్యం..
వ్యాపారమొక్కటే ముఖ్యం కాదు.. ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యం అనే ఆలోచనతో "ఐస్‌బెర్గ్ ఆర్గానిక్ ఐస్‌క్రీమ్"లు ప్రారంభించాడు. ఈ బ్రాండ్ భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ ఐస్‌క్రీమ్‌గా పేరుపొందింది. ప్రస్తుతం 100కి పైగా ఔట్‌లెట్లు, 60 డార్క్ స్టోర్‌లతో దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. సుహాస్ ఐస్‌క్రీమ్‌లలో రిఫైన్డ్ షుగర్, కెమికల్ ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, వెజిటబుల్ ఆయిల్స్, క్యాన్డ్ ఫ్రూట్‌లు ఉపయోగించడు. రుచి కోసం సహజ పదార్థాలపై దృష్టి పెట్టాడు. ముఖ్యంగా గొంధ్. ఇదొక నేచురల్ ఫుడ్ గమ్. ఇది సహజ ప్రిజర్వేటివ్‌గా పనిచేస్తుంది. 6-8 నెలలు నిల్వ ఉండేలా చేస్తుంది.
ట్రెండ్‌కు తగ్గట్టు..
ఐస్‌బర్గ్ ఐస్‌క్రీమ్‌లు దేశీ పాలు, ఆర్గానిక్ బటర్, రాక్ షుగర్, స్టేవియాతో తయారవుతాయి. ఫ్లేవర్స్‌లో 100% ఫ్రెష్ ఫ్రూట్ పల్ప్ ఉపయోగిస్తారు. ఇవి ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, విటమిన్‌లను అందిస్తాయి. ఐస్‌బెర్గ్ మెనూలో 36కి పైగా ఫ్లేవర్స్ ఉన్నాయి. క్లాసిక్ వెనిలా, బటర్‌స్కాచ్, సీతాఫల్, కొకొనట్, జామ వంటి ఆర్గానిక్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఎక్కడా దొరకని మలై ఖుర్మా, గులాబ్ జామూన్, కీటో ఐస్‌క్రీమ్ ఇక్కడుంటాయి. దుబాయ్ ట్రెండ్‌లకు అనుగుణంగా గోట్ మిల్క్, క్యామెల్ మిల్క్, డాంకీ మిల్క్ ఐస్‌క్రీమ్‌లు లాంచ్ చేశారు. ఇవి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొత్త అనుభవాన్ని ఇస్తాయి.
రూ.100 కోట్ల లక్ష్యం..
ఫ్రాంచైజీ మోడల్‌తో విస్తరిస్తున్న ఈ బ్రాండ్ హైదరాబాద్‌లో 'ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్‌బెర్గ్' అనే ప్రీమియం ఔట్‌లెట్‌ను స్టార్ట్ చేసింది. ఇక్కడ ఐస్‌క్రీమ్‌లు గ్రామ్‌ల ప్రకారం అమ్ముతారు. నెల్లూరులోని రెండెకరాల ఫ్యాక్టరీలో రోజుకు 12,500 లీటర్ల ఐస్‌క్రీమ్‌లు ఉత్పత్తి చేస్తారు. ఈ ఫ్యాక్టరీ 95% సోలార్ పవర్‌తో నడుస్తుంది. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. హైడ్రోమోతో కలిసి ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఈటీపీ) ఏర్పాటు చేసి.. వేస్ట్‌వాటర్‌ను 98% శుద్ధి చేస్తున్నారు. రూ. 25 కోట్ల టర్నోవర్‌తో నడుస్తున్న ఐస్ బర్గ్ ఐస్ క్రీమ్ కంపెనీ 2026 నాటికి రూ. 100 కోట్ల లక్ష్యంతో ముందుకెళ్తోంది.






