- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Success Story : ప్రమోషన్ ఇవ్వని బాస్.. ఏకంగా కంపెనీనే కొనేసిన ఉద్యోగిని.. ఆ తర్వాత..
రెస్టారెంట్ రంగంలో ఎక్స్‌పీరియన్స్ కలిగిన ఎగ్జిక్యూటివ్ జూలియా స్టీవర్ట్.. తన రివేంజ్ అండ్ సక్సెస్ స్టోరీని ఓ పాడ్ కాస్ట్‌లో పంచుకుంది. ఇది కదా అసలైన సక్సెస్ అంటున్న నెటిజన్లు.. ఆమెను సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. అసలు కథ ఏంటంటే...

దిశ, వెబ్ డెస్క్ : రెస్టారెంట్ రంగంలో ఎక్స్‌పీరియన్స్ కలిగిన ఎగ్జిక్యూటివ్ జూలియా స్టీవర్ట్.. తన రివేంజ్ అండ్ సక్సెస్ స్టోరీని ఓ పాడ్ కాస్ట్‌లో పంచుకుంది. ఇది కదా అసలైన సక్సెస్ అంటున్న నెటిజన్లు.. ఆమెను సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. అసలు కథ ఏంటంటే... 1990ల చివరలో ఆపిల్‌బీస్ అధ్యక్షురాలిగా ఉన్న ఆమెకు బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కంపెనీని లాభాల్లో నడిపిస్తే సీఈఓగా చేస్తానని ప్రామిస్ చేశాడు. దీంతో కొత్త టీమ్ ఏర్పాటు చేసుకుని పగలు, రాత్రి కష్టపడింది. మూడేళ్లలో కంపెనీని లాభాల బాటలో నడిపింది. స్టాక్ ధర డబుల్ చేసి గణనీయమైన వృద్ధి పొందేలా చేసింది. కానీ ఆమెకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు బాస్. ఎలాంటి వివరణ ఇవ్వకుండా నువ్వు ఎప్పటికీ కంపెనీ సీఈఓ కాలేవంటూ విసుక్కున్నాడు. దీంతో నమ్మకద్రోహానికి గట్టిగా బదులివ్వాలని నిర్ణయించుకున్న స్టీవర్ట్.. వెంటనే కంపెనీకి రాజీనామా చేసింది.
తన సత్తా చూపించేందుకు ఐహాప్‌లో చేరింది. కేవలం ఐదేళ్లలో బ్రాండ్ ఇమేజ్‌ను హై లెవల్‌కు తీసుకెళ్లింది. వృద్ధి కోసం మరో కంపెనీ కొనుగోలు చేయాలని ప్రతిపాదించింది. తను ద్రోహానికి గురైన కంపెనీ యాపిల్‌బీస్‌ను $2.3 బిలియన్లకు కొనేందుకు ఐహాప్ బోర్డును ఒప్పించింది. అగ్రిమెంట్ అయ్యాక.. ఆపిల్‌బీస్ సీఈఓ, చైర్మెన్‌ను పిలిచి.. కంపెనీకి ఇద్దరు లీడర్స్ అవసరం లేదంటూ తన మాజీ బాస్‌ను తొలగించింది. మొత్తానికి బాస్ చేతిలో తిరస్కరణకు గురైన ఆమె.. ఆ పరిస్థితిని అధిగమించి అతనిపై నియంత్రణ చేయగల స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత కంపెనీ సీఈఓ, ఛైర్‌గా దశాబ్దం పాటు సేవలందించింది. ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో బోజాంగిల్స్ బోర్డు మెంబర్‌గా, వెల్‌నెస్ యాప్ వ్యవస్థాపకురాలిగా యాక్టివ్‌గా ఉంటోంది.






