ఇష్టాలకంటే కూడా.. అయిష్టాలు షేర్ చేసుకునే వ్యక్తుల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడుతాయ్..!

by Javid Pasha |

ఇష్టాలకంటే కూడా.. అయిష్టాలు షేర్ చేసుకునే వ్యక్తుల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడుతాయ్..!

ఇష్టాలకంటే కూడా.. అయిష్టాలు షేర్ చేసుకునే వ్యక్తుల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడుతాయ్..!
X

దిశ, ఫీచర్స్ : ఒక విషయంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తులు ఒకే విధమైన ఆలోచనలు, కోరికలు, ఇష్టాలు కలిగి ఉండటం వారిని దగ్గర చేస్తాయని, అభిప్రాయాలు పంచుకోవడం వల్ల బలమైన బంధం ఏర్పడుతుందని పెద్దలు చెబుతుంటారు. కానీ ఒకలహోమా అండ్ టెక్సాస్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం మాత్రం ఇందుకు భిన్నమైన ఫలితాన్ని వెల్లడించింది. ఇష్టాలకంటే కూడా అయిష్టాలను పంచుకోవడం ద్వారా మనుషుల మద్య సంబంధాలు వేగంగా, బలంగా ఏర్పడతాయని తెలిపింది.

ఒక వ్యక్తి లేదా విషయం పట్ల అయిష్టతను వ్యక్త పరచడం వెనుక ఒక రకమైన భావోద్వేగ దుర్భలత్వం (Emotional vulnerability) ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ఇది వ్యక్తుల విలువలు, భావనల(Values and concepts)ను బయటపెడుతుంది. అయితే ఒక విషయంపట్ల అయిష్టత కలిగి ఉన్న వ్యక్తితో అదే భావనతో ఉన్న మరో వ్యక్తి ఆ విషయాన్ని షేర్ చేసుకున్నప్పుడు ఇవతలి వ్యక్తి ఒక నిజమైన సహచరుడిని (companion.) కనుగొన్న భావనను కలిగిస్తుంది.

ఒకే విధమైన అయిష్టతలు, ప్రతికూలతలు కలిగిన ఉన్న వ్యక్తులు ఆ విషయాలను పరస్పరం షేర్ చేసుకోవడంవల్ల వారి మధ్య విశ్వాసం, భావోద్వేగ సమర్థన(Faith, emotional justifications)లు పెరుగుతాయి. ఇది మానవ సంబంధాలలో ఒక రసాయనిక బంధంలా పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే ఒక ఒక అంశంపట్ల ఒకే విధమైన అయిష్టత, ప్రతికూల భావనలు కలిగిన వ్యక్తులు త్వరగా దగ్గర అవుతారని, వారి మధ్య స్నేహం, బలమైన బంధం వేగంగా ఏర్పడతాయని అధ్యయనం పేర్కొన్నది. Link

Next Story