- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anxiety & Empathy : మీలో సోషల్ యాంగ్జైటీస్ ఎక్కువా..? అయితే అది కూడా ఎక్కువే!!
Anxiety & Empathy : మీలో సోషల్ యాంగ్జైటీస్ ఎక్కువా..? అయితే అది కూడా ఎక్కువే!!

దిశ, ఫీచర్స్ : మీరు కొన్ని కొన్ని విషయాల్లో ఎక్కువ ఆందోళన చెందుతారా? ముఖ్యంగా సోషల్ యాంగ్జైటీస్ ఎక్కువా? అయితే మీలో అది కూడా ఎక్కువే అంటున్నారు నిపుణులు. అదంటే ఏదో కాదిక్కడ. కేవలం సానుభూతి(empathy) మాత్రమే. సామాజిక ఆందోళనకు దీనికి సంబంధం ఉందంటోంది రీసెంట్ స్టడీ. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం అధిక సామాజిక ఆందోళన ఉన్న వ్యక్తులు వాస్తవానికి అధిక స్థాయిలో సానుభూతి( higher levels of empathy)ని కలిగి ఉండవచ్చని తెలిపింది. ఫ్రాంటియర్స్ ఇన్ న్యూరోసైన్స్‌లోపబ్లిషైన్ పీర్-రివ్యూడ్ పరిశోధన కూడా ఈ విషయాన్నే పేర్కొన్నది.
అధ్యయనంలో భాగంగా పరిశోధకులు సోషల్ యాంగ్జైటీస్, అలాగే ఎమోషనల్ సెన్సిటివిటీ మధ్య సంబంధాన్ని అన్వేషించడానికి బ్రెయిన్ ఇమేజింగ్ డేటాను, అట్లనే సైకాలజిక్ అసెస్మెంట్ల(psychological assessments)ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అధిక సామాజిక ఆందోళన(High social anxiety) కలిగి ఉండే వ్యక్తులు మెదడులోని అంటీరియర్ సింగులేట్ కార్టెక్స్(Anterior cingulate cortex) అండ్ ప్రీక్యూనియస్(Precuneus) వంటి సానుభూతి, భావోద్వేగ ప్రక్రియకు బాధ్యత వహించే ప్రాంతాలలో ఎక్కువ కార్యాచరణ(greater activity)ను ప్రదర్శించారని కనుగొన్నారు.
అయితే సోషల్ యాంగ్జైటీ కలిగిన వ్యక్తులు ఇతరుల భావోద్వేగాలు, ముఖ కవళికలు, సామాజిక సంకేతాలను(Social signals) మరింత లోతుగా గ్రహిస్తారని, అర్థం చేసుకుంటారని కూడా అధ్యయనం సూచిస్తోంది. అంటే ఇది ఆయా వ్యక్తుల్లో సామాజిక నైపుణ్యాలు లేకపోవడంవల్ల ఏర్పడే లక్షణం ఏమాత్రం కాదు. కానీ వారు ఈ అనుభవాలను మరింత తీవ్రంగా అనుభవించడం, ప్రాసెస్ చేయడం చేస్తారని పరిశోధకులు అంటున్నారు. సామాజిక పరిస్థితులను అతిగా భావించేలా చేసినప్పటికీ, ఇదొక ప్రత్యేక భావోద్వేగ బలానికి(special emotional strength), స్పష్టమైన అవగాహనకు నిదర్శనమని, జాలి, దయ, కరుణ వంటి భావాలకు సంబంధించిన లోతైన సామర్థ్యాన్ని తెలియజేస్తుందని చెబుతున్నారు.






