- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోజుకు 10 నిమిషాలు ఆ విధమైన సంభాషణ.. బలమైన సంబంధాలకు ఎలా దారితీస్తుందంటే..
రోజుకు 10 నిమిషాలు ఆ విధమైన సంభాషణ.. బలమైన సంబంధాలకు ఎలా దారితీస్తుందంటే..

దిశ, ఫీచర్స్ : ఎంత ప్రేమ ఉన్నప్పటికీ.. కమ్యూనికేషన్ లేని సంబంధాలు ఎక్కువ కాలం నిలబడవు అంటారు పెద్దలు. వర్జీనియా యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టుల తాజా అధ్యయనం కూడా అదే వెల్లడించింది. రిలేషన్‌షిప్‌లో పరస్పర సంభాషణకు తావులేకపోతే మనస్తత్వాలు అర్థం కావని, మనస్పర్థలకు దారితీస్తుందని పేర్కొన్నది. అయితే రోజుకు కేవలం 10 నిమిషాలపాటు పూర్తి శ్రద్ధతో కూడిన, ఎటువంటి అంతరాయంలేని సంభాషణ(Uninterrupted conversation) మాత్రం సంబంధాలలో భావోద్వేగ సాన్నిహిత్యాన్ని మెరుగు పరుస్తుందని తెలిపింది. దీనినే ‘10-minute conversation rule’గా నిపుణులు పేర్కొంటున్నారు.
అధ్యయనంలో భాగంగా మనస్తత్వ శాస్త్రవేత్తలు 200 మందికిపైగా జంటలను ప్రశ్నించారు. అలాగే ‘10-minute conversation rule’ వారిలో సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందోనని పరిశీలించారు. అంటే ఈ రూల్ ప్రకారం.. ఫోన్లు వాడటం, ఇతర మల్టీ టాస్కింగ్ వ్యవహారాలు వంటివి ఉండకూడదు. కేవలం ఇద్దరు వ్యక్తులు ఒకరిపట్ల ఒకరు శ్రద్ధతో, ఆసక్తితో, ఏకాగ్రతతో మాట్లాడుకోవాలి. అయితే ఎటువంటి ఆటంకాలు లేని ఈ విధమైన సంభాషణ రోజుకు 10 నిమిషాలు కొనసాగించిన జంటల జీవన సంతృప్తిలో మెరుగైన ఫలితాలు కనిపించాయని అధ్యయనం పేర్కొన్నది.
మిగతా సందర్భాలతో, మిగతావారితో పోలిస్తే రోజుకు పది నిమిషాల శ్రద్ధతో కూడిన సంభాషణ కొనసాగించే జంటలు74 % ఎక్కువ భావోద్వేగ సంబంధాన్ని(More emotional connection), రెండు రెట్లు ఎక్కువ సంతృప్తిని (Relationship satisfaction) కనబరిచినట్లు అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా తప్పుడు అవగాహకు, అపార్థాలకు, వివాదాలకు అవకాశంలేని చక్కటి పరిష్కారంగా ఈ సంభాషణ నిలుస్తుందని పేర్కొన్నది. ఎందుకంటే పూర్తి శ్రద్ధతో కూడిన 10 నిమిషాల కన్వర్జేషన్ అనేది శరీరంలోని న్యూరోనల్ సిస్టమ్‌ను మరింత యాక్టివేట్ చేయడం, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్ల సమతుల్యతను మెరుగు పర్చడంవల్ల దంపతుల మధ్య మానసిక శ్రేయస్సుకు, బలమైన సంబంధాలకు దోహదం చేస్తుందని అధ్యయనం స్పష్టం చేసింది.






