- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోజుకో చిన్న గ్లాస్ చాలు.. దానిమ్మ జ్యూస్‌తో ధమనులు సురక్షితం!
రోజూ ఒక చిన్న గ్లాస్ (50.మి.లీ) దానిమ్మ జ్యూస్ తాగడంవల్ల పలుచబడిన ఆర్టెస్ వాల్స్ సాధారణంగా మారే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొన్నది.

దిశ, ఫీచర్స్ : ఇటీవల పలువురు ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడటం, అవి సన్నగా మారడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల శరీరంలో రక్త ప్రవాహం తగ్గుతుందని, ఫలితంగా హార్ట్, బ్రెయిన్, కిడ్నీ వంటి అవయవాలపై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాంటి జాగ్రత్తల్లో దానిమ్మ జ్యూస్ తీసుకోవడం కూడా ఒకటి అంటున్నారు నిపుణులు. దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధమనుల్లో బ్లాక్ (plaque buildup) ఏర్పడటాన్ని అథెరోస్‌క్లెరోసిస్ (Atherosclerosis) అంటారు. ఆర్టెరీస్ వాల్స్‌పై కొలెస్ట్రాల్, కాల్షియం, ఇతర పదార్థాలు పేరుకుపోవడంవల్ల ఇలా జరుగుతుంది. అయితే సమస్య ఏర్పడకముందే నివారణలో భాగంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రోజూ ఒక చిన్న గ్లాస్ (50.మి.లీ) దానిమ్మ జ్యూస్ తాగడంవల్ల ఆర్టెరీల్లో ఆటంకాలు, అంటే.. బ్లాక్స్ ఏర్పడకుండా ఉంటాయని చెబుతున్నారు. గతంలో క్లినికల్ న్యూట్రిషన్ (Clinical Nutrition) జర్నల్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం కూడా ఇదే పేర్కొన్నది. దానిమ్మ జ్యూస్ తాగడంవల్ల ధమనుల్లో పలుచదనం (arterial wall thickening) తగ్గి కొంత వరకు రివర్స్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఎందుకంటే అధ్యయనంలో భాగంగా కెరోటిడ్ ఆర్టరీ స్టెనోసిస్ ఉన్న రోగులు ఏడాదిపాటు రోజూ 50 మి.లీ. దానిమ్మ రసం తాగినప్పుడు పలుచబడిన ఆర్టెరీస్ 35% వరకు సాధారణ స్థితికి వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే దానిమ్మ జ్యూస్ లేదా దానిమ్మ రసం తాగనివారిలో థిక్‌నెస్ 9% పెరిగిందని కనుగొన్నారు. అంతేకాదు, సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ కూడా దానిమ్మరసం తాగినవారిలో 12% తగ్గినట్లు తేలింది. కాబట్టి దానిమ్మ రసం హార్ట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధ్యయనం స్పష్టం చేసింది.
దానిమ్మ రసంలో పాలీఫెనాల్స్ (Especially tannins & anthocyanins) ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గించి, PON1 ఎంజైమ్‌ని బూస్ట్ చేసి, రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యాన్ని పెంచుతాయి. దీంతో ధమనులు రక్షణ పొంది, ఇన్‌ఫ్లమేషన్ తగ్గి, బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్ అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ అధ్యయనం కేవలం 10 మంది రోగులపై మాత్రమే కొనసాగింది కాబట్టి ఫలితాలు వ్యక్తిగతంగా మారవచ్చు. కేవలం దానిమ్మ రసం మాత్రమే ధమనుల్లో బ్లాక్స్‌ను తగ్గిస్తుందని నిర్ణయానికి రాకూడదు. కాకపోతే సమస్య ఏర్పడకముందు తీసుకునే నివారణలో భాగంగా తీసుకోవాల్సిన వాటిలో దానిమ్మ రసం కూడా ఒకటని గుర్తుంచుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఇది వైద్య నిపుణుల సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






