Insomnia : 6 గంటలకంటే తక్కువసేపు నిద్రపోతున్నారా? ఆ విషయంలో 60% నష్టపోయినట్టే..!

by Javid Pasha |

Insomnia : 6 గంటలకంటే తక్కువసేపు నిద్రపోతున్నారా? ఆ విషయంలో 60% నష్టపోయినట్టే..!

Insomnia : 6 గంటలకంటే తక్కువసేపు నిద్రపోతున్నారా? ఆ విషయంలో 60% నష్టపోయినట్టే..!
X

దిశ, ఫీచర్స్ : కంటినిండా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదని, నిద్రలేమితో అనారోగ్యాలు సంభవిస్తాయనే విషయం తెలిసిందే. కాగా తాజా అధ్యయనం మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించింది. ప్రతిరోజూ 6 గంటకంటే తక్కువ నిద్రపోయేవారు ఆ విషయంలో తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తారని పేర్కొన్నది. ఇంతకీ అదే విషయం.. అనుకుంటున్నారా? ఇది చదివేయండి మీకే తెలుస్తుంది.

ఒక్కరోజు సరిగ్గా నిద్రపట్టకుంటేనే మరుసటి రోజు మైండ్ పనిచేయదంటారు చాలామంది. ఇక రోజుల తరబడి కనీసం 6 గంటలు కూడా నిద్రపోకపోతే! నో డౌట్.. మానసిక రుగ్మతలతో పాటు శారీరక అనారోగ్యాలు దాడిచేయడం ప్రారంభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా రీసెంట్ స్టడీ దీంతోపాటు మరో కొత్త అంశాన్ని కూడా జోడించింది. ఏంటంటే.. ప్రతిరోజూ 6 గంటలకంటే తక్కువనిద్రపోయే పరిస్థితిని దీర్ఘకాలంపాటు అనుభవించిన వారు 60% కండరాల నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన పరిశోధకుల అధ్యయనం పేర్కొన్నది.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 100 మంది అధిక బరువుగల పురుషులు, స్త్రీలను అబ్జర్వ్ చేశారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి రెండు వారాలపాటు వారి నిద్ర అలవాట్లను అధ్యయనం చేశారు. అయితే ఒక దశలో రోజుకు 8.5 గంటలు నిద్రపోయే వారిని, మరొక దశలో రోజుకు 5.5 గంటలు మాత్రమే నిద్రపోయే వారిని పరిశీలించారు. కాగా ఈ రెండు గ్రూపుల వారు కూడా ఒకే విధమైన తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకున్నారు. కొంతకాలం అలా అబ్జర్వ్ చేస్తూ వారి హెల్త్ డేటాను ట్రాక్ చేసిన పరిశోధకులు రెండు దశల్లోనూ అందరూ 3 కిలోల బరువు తగ్గినట్లు గుర్తించారు.

అయితే 8.5 గంటల నిద్రపోయేవారితో పోల్చినప్పుడు 5.5 గంటలు మాత్రమే నిద్రపోయేవారు తాము తగ్గిన బరువుతోపాటు 60% కండరాల ద్రవ్యరాశిని కోల్పోయినట్లు కనుగొన్నారు. కాగా 6 గంటలకంటే తక్కువగా నిద్రపోయేవారిలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ అధికంగా రిలీజ్ అవుతుందని, ఇది కండరాల పటుత్వానికి అవసరమైన ప్రొటీన్ విచ్ఛిన్నానికి దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Next Story