Green tea effect : గ్రీన్ టీతో పురుషుల్లో టెస్టో స్టెరాన్ బూస్ట్ : సెక్స్ కోరికలు పెరిగే సీక్రెట్ వెల్లడి!

by Javid Pasha |

Green tea effect : గ్రీన్ టీతో పురుషుల్లో టెస్టో స్టెరాన్ బూస్ట్ : సెక్స్ కోరికలు పెరిగే సీక్రెట్ వెల్లడి!

Green tea effect : గ్రీన్ టీతో పురుషుల్లో టెస్టో స్టెరాన్ బూస్ట్ : సెక్స్ కోరికలు పెరిగే సీక్రెట్ వెల్లడి!
X

దిశ, ఫీచర్స్ : గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. ఉదయంపూట రోజుకో కప్పు తాగడంవల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయని, మానసిక స్థితి మెరుగు పడుతుందని, మెదడు చురుగ్గా పనిచేస్తుందని పలు అధ్యయనాలు సైతం పేర్కొన్నాయి. అయితే ‘‘Frontiers in Public Health’’లో పబ్లిషైన లేటెస్ట్ స్టడీ మాత్రం రోజుకో కప్పు గ్రీన్ టీ తాగడం పురుషుల్లో సెక్స్ కోరికలను కూడా పెంచుతుందని తేల్చింది.

అధ్యయనంలో భాగంగా 45 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు గల 280 మంది పురుషులను పరిశోధకులు ప్రశ్నించారు. గ్రీన్ టీ తాగడం వల్ల వారి శరీరంలో వస్తున్న మార్పులను సైతం విశ్లేషించారు. కాగా 20 ఏండ్లుగా రోజుకో కప్పు లేదా అంతకంటే ఎక్కువసార్లు గ్రీన్ టీ తాగే పురుషుల్లో, తాగని వారితో పోలిస్తే టెస్టో స్టెరాన్ స్థాయిలు 30% ఎక్కువగా, అలాగే 27% తక్కువ బాడీ ఇన్‌ఫ్లమేషన్ (వాపు) కనిపించాయి. పైగా ఈ వయసులో కూడా గ్రీన్ టీ తాగేవారు శృంగారంపట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటున్నారు. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఎపిగాల్లోకాటెచిన్ గాలేట్ (EGCG) వంటి సమ్మేళనాలు కలిగి ఉండటంవల్ల గ్రీన్ టీ తాగేవారిలో అది టెస్టోస్టెరాన్‌ను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లను అడ్డుకోవడంతో పాటు, నొప్పి, వాపు వంటి సమస్యలను సైతం దూరం చేస్తున్నట్లు అధ్యయనం పేర్కొన్నది.

Next Story